Site icon HashtagU Telugu

Bombing On Historical Church : గాజాలోని పురాతన చర్చిపై ఇజ్రాయెల్ బాంబుదాడి

Bombing On Historical Church

Bombing On Historical Church

Bombing On Historical Church : చివరకు ప్రాచీన చర్చిని కూడా ఇజ్రాయెల్ వదల్లేదు.  దాదాపు 1200 ఏళ్ల క్రితం (1150 సంవత్సరంలో) నిర్మించిన గాజాలోని గ్రీక్ ఆర్థోడాక్స్  సెయింట్ పోర్ఫిరియస్ చర్చిపై ఇజ్రాయెల్ ఆర్మీ బాంబులు జారవిడిచింది.   గతంలో ఎన్నో యుద్ధాలు జరిగినప్పుడు ప్రజలు మతాలకు అతీతంగా ఈ చర్చిలోకి వచ్చి దాక్కునేవారు. ఇప్పుడు ఏకంగా ఈ చర్చిపైనే అకస్మాత్తుగా బాంబుల వర్షం కురవడంతో.. డజన్ల కొద్దీ ప్రజలు తీవ్ర గాయాలపాలయ్యారు. మరికొందరి పరిస్థితి విషమంగా ఉంది. మరెంతో మంది చర్చి శిథిలాల కింద చిక్కుకుపోయారు.

We’re now on WhatsApp. Click to Join.

గాజా ప్రజలు ఇజ్రాయెల్ వైమానిక దాడుల నుంచి ప్రాణాలను రక్షించుకునేందుకు ఆస్పత్రులు, చర్చిలలో ఆశ్రయం పొందుతున్నారు. అయితే వాటిపైనా దాడులు జరుగుతుండటంతో ప్రజలు అరచేతిలో ప్రాణాలు పెట్టుకొని జీవిస్తున్నారు. ఈ దాడిపై స్పందించిన ఇజ్రాయెల్.. అది హమాస్ చేసిన పనే అయి ఉండొచ్చని వ్యాఖ్యానించింది. గాజా స్ట్రిప్‌లోని ప్రజలను హమాస్ మానవ కవచాలుగా వాడుకుంటోందని ఆరోపించింది.  ఇప్పటివరకు ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడుల్లో గాజా స్ట్రిప్‌లో దాదాపు 3,785 మంది పాలస్తీనియన్లను  చనిపోయారు. వారిలో ఎక్కువ మంది సాధారణ పౌరులే.

Also Read: Supreme Court: సుప్రీంకోర్టు కీలక నిర్ణయం, మాన్యువల్ స్కావెంజర్స్ కు నష్టపరిహారం 30 లక్షలు