Site icon HashtagU Telugu

Palestinian State : ప్రత్యేక పాలస్తీనాను గుర్తించిన ఐర్లాండ్‌, స్పెయిన్‌, నార్వే

Palestinian State

Palestinian State

Palestinian State : పాలస్తీనా దేశాన్ని అధికారికంగా గుర్తిస్తామని నార్వే, ఐర్లాండ్, స్పెయిన్ బుధవారం ప్రకటించాయి. మే 28 నుంచి తమ నిర్ణయం అమల్లోకి వస్తుందని నార్వే, స్పెయిన్ తెలిపాయి. ఇజ్రాయెల్-పాలస్తీనియన్లకు రాజకీయ పరిష్కారాన్ని అందించే ఏకైక ప్రత్యామ్నాయంగా ఇది సహాయపడుతుందనే ఉద్దేశంతో స్వతంత్ర పాలస్తీనా దేశాన్ని గుర్తిస్తున్నామని నార్వే ప్రధానమంత్రి జోనాస్ గహర్ స్టోరే వెల్లడించారు. డబ్లిన్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో ఐరిష్ ప్రధాన మంత్రి సైమన్ హారిస్ మాట్లాడుతూ.. పాలస్తీనా రాజ్యాన్ని గుర్తించాలనే తమ నిర్ణయం చీకట్లో ఉన్న అక్కడి ప్రజలకు ఆశ, ప్రోత్సాహాన్ని అందిస్తాయన్నారు.

We’re now on WhatsApp. Click to Join

ఈ ప్రకటనల నేపథ్యంలో ఐర్లాండ్, నార్వే నుంచి తన రాయబారులను వెంటనే తిరిగి రావాలని ఇజ్రాయెల్ ఆదేశించింది. స్పెయిన్‌‌లోని తమ రాయబారిని కూడా వెనక్కి పిలుచుకుంటామని ఇజ్రాయెల్ ప్రకటించింది. ఈ దేశాలు పాలస్తీనా  దేశాన్ని గుర్తించడం ద్వారా గాజాలో ఉన్న ఇజ్రాయెలీ బందీలను తిరిగి స్వదేశానికి తీసుకొచ్చే ప్రయత్నాలను అడ్డుకున్నాయని ఇజ్రాయెల్ ఆరోపించింది.‘‘పాలస్తీనా దేశాన్ని గుర్తించడం వల్ల ఈ ప్రాంతంలో మరింత తీవ్రవాదం, అస్థిరత, శాంతి పెరిగేందుకు ఊతం లభిస్తుంది’’ అని పేర్కొంటూ ఇజ్రాయెల్ విదేశాంగ శాఖ ట్విట్టర్‌లో ఓ పోస్ట్ చేసింది. ఐక్యరాజ్యసమితిలోని 193 సభ్య దేశాలకుగానూ 140 దేశాలు ఇప్పటికే పాలస్తీనాను(Palestinian State) అధికారికంగా గుర్తించాయి.

Also Read : Congress : తక్కువ సీట్లలో కాంగ్రెస్ ఎందుకు పోటీ చేస్తోందో చెప్పేసిన ఖర్గే

పాలస్తీనా రాజ్యాధికార సమస్య దశాబ్దాలుగా అంతర్జాతీయ సమాజాన్ని వేధిస్తోంది. 1988లో పాలస్తీనియన్ల ప్రధాన ప్రతినిధి అయిన పాలస్తీనా లిబరేషన్ ఆర్గనైజేషన్ (PLO) మొదటిసారిగా పాలస్తీనా రాష్ట్ర ఏర్పాటును ప్రకటించింది. ఇజ్రాయెల్ – హమాస్ మధ్య గతేడాది అక్టోబరు 7 నుంచి భీకర యుద్ధం జరుగుతున్న తరుణంలో ఇది అత్యంత కీలక పరిణామమని పరిశీలకులు అంటున్నారు.  యూరోపియన్ యూనియన్ (ఈయూ) అనేది ఇజ్రాయెల్‌కు అతిపెద్ద వాణిజ్య భాగస్వామి. ఈయూలోని నార్వే, ఐర్లాండ్, స్పెయిన్ దేశాలు పాలస్తీనాను గుర్తించడం అనేది ఇజ్రాయెల్‌కు పెద్ద షాక్ లాంటిదే. ఎందుకంటే ఆ దేశాలను వ్యతిరేకించేందుకు ఈయూ సాహసం చేయదు. ఎందుకంటే అవి నార్వే, ఐర్లాండ్, స్పెయిన్ కూడా ఇజ్రాయెల్‌కు నేస్తాలే. వాటితో సంబంధాలను తెంచుకుంటే.. ఎక్కువ నష్టం ఇజ్రాయెల్‌కే జరుగుతుంది.

Also Read : Hemant Soren : సుప్రీంకోర్టులో పిటిషన్‌ వెనక్కి తీసుకున్న మాజీ సీఎం హేమంత్‌ సోరెన్‌