IPL Auction 2024 : ఐపీఎల్ చరిత్రలో అత్యంత ఖరీదైన ఆటగాడిగా ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ నిలిచాడు. ఇవాళ దుబాయ్ వేదికగా జరిగిన ఐపీఎల్ వేలంలో అతడు రూ.20 కోట్ల ధరకు అమ్ముడుపోయాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమ్ రూ.20.5 కోట్లకు అతడితో ఒప్పందం కుదుర్చుకుంది. వాస్తవానికి తొలుత కమిన్స్ కోసం రాయల్ ఛాలెంజర్ బెంగళూరు, చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ టీమ్స్ మధ్య బిడ్డింగ్ వార్ నడిచింది. చివర్లో ఎంటరైన సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమ్ కమిన్స్‌ను దక్కించుకుంది. ఈ ఫాస్ట్ బౌలర్ గతంలో ఢిల్లీ క్యాపిటల్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ టీమ్స్ తరఫున ఆడాడు.
We’re now on WhatsApp. Click to Join.
2020లో జరిగిన వేలంలో రూ.15.5 కోట్లకు కమిన్స్‌ను కోల్‌కతా నైట్ రైడర్స్ టీమ్ దక్కించుకుంది. 2022లో ముంబై ఇండియన్స్‌పై కోల్‌కతా నైట్ రైడర్స్ తరఫున కమిన్స్ 14 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేశాడు. ఇది ఐపీఎల్ చరిత్రలోనే రెండో ఫాస్టెస్ట్ ఫిఫ్టీ. ఆస్ట్రేలియా టీమ్ జూన్‌లో ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ టైటిల్ గెలవడంలో కమిన్స్ పాత్ర కీలకం. ఇంగ్లాండ్‌లో యాషెస్ సిరీస్‌ను కూడా ఆస్ట్రేలియా టీమ్ నిలబెట్టుకునేలా చేశాడు. ODI ప్రపంచ కప్‌ను ఆస్ట్రేలియా గెలుచుకోవడంలో ముఖ్య పాత్ర పోషించాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమ్ మొత్తం రూ. 34 కోట్లతో వేలం ప్రారంభించి.. కమిన్స్, ట్రావిస్ హెడ్, వనిందు హసరంగాలను దక్కించుకుంది. దాని అకౌంట్లో రూ. 5.2 కోట్లు మిగిలాయి.
Also Read: IPL Auction 2024: ఐపీఎల్ 2024 వేలం.. తొలి సెట్ లో అమ్ముడుపోని ఆటగాళ్లు వీళ్ళే..!
- భారత ఆల్ రౌండర్ శార్దూల్ ఠాకూర్.. చెన్నై సూపర్ కింగ్స్‌కు 4 కోట్ల రూపాయలకు అమ్ముడయ్యాడు. చివరిసారిగా అతడు కోల్‌కతా నైట్ రైడర్స్ తరపున ఆడాడు. ఇంతక్రితం జరిగిన వేలంలో అతడు రూ.10.75 కోట్లకు అమ్ముడయ్యాడు. ఠాకూర్ 2023లో 11 మ్యాచ్‌లు ఆడాడు. 113 పరుగులు చేసి, ఏడు వికెట్లు మాత్రమే తీశాడు.అందుకే ఈసారి అతడి రేటు తగ్గింది.
- IPL వేలం 2024లో(IPL Auction 2024) న్యూజిలాండ్‌కు చెందిన రచిన్ రవీంద్రను చెన్నై సూపర్ కింగ్స్ రూ. 1.8 కోట్లకు దక్కించుకుంది. అంతకుముందు ఇతడి కోసం పంజాబ్ కింగ్స్, చెన్నై సూపర్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్‌లు పోటీపడ్డాయి. చివరకు ఎక్కువ రేటును కేటాయించి అతడిని చెన్నై సూపర్ కింగ్స్ కొనేసింది.