CP CV Anand: హైదరాబాద్ నగర ట్రాఫిక్ నిర్వహణలో కీలక మార్పులు రాబోతున్నాయని నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ తెలిపారు. వాహనాల వేగం గణనీయంగా పెరుగుతున్నదని చెబుతూ, ప్రస్తుతం నగర రోడ్లపై వాహనాలు సగటున గంటకు 24 నుంచి 26 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తున్నాయని పేర్కొన్నారు. “రోడ్లు అదే స్థాయిలో ఉండగా వాహనాల స్పీడ్ మాత్రం పెరిగింది,” అని అన్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో 95 లక్షల వాహనాలు ఉన్నాయని వివరించిన సీపీ, “వంద టౌన్ వెడ్డింగ్ ఏర్పాటుతో పాటు తోపుడు బండ్లు, ఫుట్‌పాత్‌లపై కబ్జాలను తొలగించడంతో ట్రాఫిక్ వేగం మెరుగైంది” అని వివరించారు.
Maoists : తెలంగాణలో 12 మంది ఛత్తీస్‌గఢ్ మావోయిస్టుల లొంగుబాటు
ట్రాఫిక్ నియంత్రణలో భాగంగా ఆపరేషన్ రోప్ను మరింత ముందుకు తీసుకెళ్లనున్నట్లు సీపీ వెల్లడించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, తన కోసం ట్రాఫిక్ ఆపొద్దని, ఎదురు రూట్ల ద్వారా వెళ్లే ఆదేశాలు కూడా వద్దని చెప్పిన విషయాన్ని సీపీ పంచుకున్నారు. అలాగే నగరంలోని సిగ్నళ్లలో 85 శాతం ఆటోమేటిక్ మోడ్‌లో పనిచేస్తున్నాయని, ఇకపై ట్రాఫిక్ ఉల్లంఘనల సంఖ్య కాకుండా, వాటి నాణ్యతపై దృష్టి సారించనున్నట్లు తెలిపారు. డ్రోన్ల సాయంతో ట్రాఫిక్ మానిటరింగ్‌కు ప్రయోగాత్మక ప్రయత్నాలు జరుగుతున్నాయని వెల్లడించారు. ట్రాఫిక్ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో డ్రోన్లు ఉపయోగించి మానిటరింగ్ నిర్వహించనున్నట్లు చెప్పారు.
Bonalu Festival : బోనాల పండుగకు సిద్ధమవుతున్న భాగ్యనగరం..అధికారులతో మంత్రి పొన్నం ప్రభాకర్ సమీక్ష