Fishes Flood : చెరువులు, కుంటల్లో చేపలను పట్టేందుకు మనం ఎన్నో తంటాలు పడుతుంటాం.. అలాంటిది చేపలు వాటంతటవే చెరువులు, కుంటల నుంచి బయటికి వచ్చి ఒక కిలోమీటరు మేర నేలపై పరుచుకొని పోతే? భలే ఉంటుంది కదూ ! ఇలాంటి భలే సీన్ జపాన్ లోని హక్కైడో ప్రిఫెక్చర్‌లోని హకోడేట్ సముద్ర తీరంలో ఆవిష్కృతం అయింది. చనిపోయిన వేలాది చేపలు తీరానికి కొట్టుకొని రావడం కలకలం రేపింది. ఇంతకీ ఆ చేపలు ఎందుకు చనిపోయాయి అనేది తెలియరాలేదు.
We’re now on WhatsApp. Click to Join.
” ఏదైనా భారీ చేప ఈ చేపలను తరిమి ఉండొచ్చు. దాని నుంచి తప్పించుకునేందుకు చాలాసేపు ఈదడం వల్ల ఈ చిన్న చేపలు అలసిపోయి చనిపోయి ఉంటాయి. చేపలన్నీ ఒకే చోటుకు చేరుకోవడం వల్ల ఆక్సిజన్ కొరత తలెత్తి అవి చనిపోయి ఉండొచ్చు” అని హకోడాటె ఫిషరీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ పరిశోధకుడు టకాషి ఫుజియోకా తెలిపారు. ఆ చేపలు ఎందుకు చనిపోయాయి అనే వివరాలు ఇంకా తెలియనందున వాటిని తినడం మంచిది కాదని సూచించారు. ఒక్కసారిగా శీతల జలాల్లోకి ప్రవేశించినందు వల్ల కూడా ఇలా చేపలు చనిపోతుంటాయని ఆయన వివరించారు. స్థానిక అధికారులు సముద్రం ఒడ్డుకు చేరుకుని మృతిచెందిన చేపలను సేకరించి, టెస్టింగ్ కోసం పంపారు.
Also Read: KTR: ఎమ్మెల్యేగా కేటీఆర్ ప్రమాణస్వీకారం వాయిదా, కారణమిదే!
ఇటీవల ఆస్ట్రేలియాలోనూ సముద్ర తీరానికి భారీ సంఖ్యలో పైలట్ తిమింగలాలు కొట్టుకొచ్చాయి. వాటిలో కొన్ని అక్కడి ఇసుక తిన్నెల్లో చిక్కుకొని చనిపోయాయి . ఇక న్యూజిలాండ్‌లోనూ వందలాది పైలట్ తిమింగలాలు సముద్రం నుంచి ఒడ్డుకు కొట్టుకొచ్చి ప్రాణాలు కోల్పోయాయి. అరుదైన పైలట్ తిమింగలాలు ఇలా చనిపోవడంపై పర్యావరణవేత్తలు ఆందోళన(Fishes Flood) వ్యక్తంచేస్తున్నారు.