Wheat Grass: గోధుమ గడ్డి రసంతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.?

గోధుమ గడ్డి వల్ల అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం తెలిసిందే. గోధుమ గడ్డిలో మెగ్నీషియం, క్లోరోఫిల్, కాల్షియం, అయోడిన్, సెలీనియం, జింక్, ఐరన్, ఫైబర్, విటమిన్ కె, విటమిన్ బి,సి,ఇ వంటి పోషకాలు పెద్ద మొత్తంలో ఉంటాయి.

  • Written By:
  • Publish Date - September 3, 2022 / 02:18 PM IST

గోధుమ గడ్డి వల్ల అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం తెలిసిందే. గోధుమ గడ్డిలో మెగ్నీషియం, క్లోరోఫిల్, కాల్షియం, అయోడిన్, సెలీనియం, జింక్, ఐరన్, ఫైబర్, విటమిన్ కె, విటమిన్ బి,సి,ఇ వంటి పోషకాలు పెద్ద మొత్తంలో ఉంటాయి. అయితే తాజా ఆకుపచ్చ గోధుమ గడ్డి దొరకని వారు దాని పొడిని కూడా తీసుకుంటూ ఉంటారు. ఈ గోధుమ గడ్డి రసం తీసుకోవడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. గోధుమ గడ్డితో అజీర్ణం, గ్యాసం, అసిడిటీ, మలబద్దకం వంటి సమస్యలు దరిచేరవు. ఇందులో జింక్, మెగ్నిషియం వంటి పోషకాలు అధికంగా ఉంటాయి.

అలాగే శరీరంలోని వాపులు కూడా తగ్గుతాయి. ఈ గోధుమ గడ్డి అలర్జీలు రాకుండా, అస్తమా వంటి శ్వాసకోశ వ్యాధులను అరికట్టేలా చేస్తుంది. అంతే కాకుండా ప్రేగుల్లోని చెత్తా చెదారాన్ని గోధుమ గడ్డి క్లీన్ చేయడంలో ముఖ్యపాత్ర వహిస్తుంది. అల్సర్ వంటి సమస్యను జయించేలా చేస్తుంది. క్లోరోఫిల్ సమృద్ధిగా ఉండటంతో రక్తం శుద్ధి కావడమేగాకుండా రక్తం పెరుగుదలకు కూడా తోడ్పడుతుంది. అలాగే ప్రతిరోజు గోధుమ గడ్డి రసం లేదా పొడిని నీటిలో కలుపుకుని తాగడం వల్ల రక్తహీనత,రక్తపోటు సమస్యలు తగ్గిపోతాయి. ఊబకాయ సమస్యల నుంచి కూడా విముక్తి లభిస్తుంది.

అలాగే జీర్ణ క్రియ సమర్థవంతంగా పనిచేస్తుంది. చెడు కొలెస్ట్రాల్ ని కూడా తగ్గిస్తుంది. గుండె జబ్బులు కూడా దరిచేరవు. పేగుల్లో మంట తగ్గుతుంది. కాగా 6 నుంచి 8 అంగుళాలు పెరిగిన గడ్డిని తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. అయితే అలర్జీ సమస్యలు ఉన్నవారు దీనిని తీసుకోకపోవడం మంచిది.