Site icon HashtagU Telugu

Ceasefire Extended : ఇజ్రాయెల్ – హమాస్ కాల్పుల విరమణ గడువు పొడిగింపు

Ceasefire Extended

Ceasefire Extended

Ceasefire Extended : ఇజ్రాయెల్ – హమాస్ మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందాన్ని మరో రెండు రోజులకు పొడిగించారు. నాలుగు రోజుల కాల్పుల విరమణ ఒప్పందం సోమవారంతో ముగిసింది. దీంతో దాన్ని మరో రెండు రోజులకు.. అంటే బుధవారం వరకు పొడిగించారు.  ఈవిషయాన్ని ఇజ్రాయెల్ ప్రభుత్వం సోమవారం ప్రకటించింది. దీంతో బుధవారం వరకు ఇరువైపుల నుంచి బందీల విడుదల కొనసాగనుంది.

We’re now on WhatsApp. Click to Join.

శుక్రవారం నుంచి సోమవారం వరకు దాదాపు 50 మంది ఇజ్రాయెలీ బందీలను పాలస్తీనా మిలిటెంట్ సంస్థ హమాస్ విడుదల చేయగా.. 150 మంది పాలస్తీనా ఖైదీలను ఇజ్రాయెల్ రిలీజ్ చేసింది. కాల్పుల విరమణను మరో రెండు రోజులు పొడిగించడంపై  ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్ స్పందిస్తూ.. ‘‘యుద్ధం అనే చీకటి మధ్యలో ఆశ, మానవత్వపు వెలుగు ప్రకాశించింది’’ అని కామెంట్ చేశారు. కాల్పుల విరమణ ఒప్పందాన్ని మరో రెండు రోజులు పొడిగించడాన్ని అమెరికా స్వాగతించింది. ఖతర్, అమెరికా, ఈజిప్ట్ మధ్యవర్తిత్వంతో ఇజ్రాయెల్ – హమాస్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం(Ceasefire Extended) కుదిరింది.