Site icon HashtagU Telugu

Trump Defeat Biden : ఇప్పుడు ఎన్నికలైతే ట్రంప్ గెలుపు, బైడెన్ ఓటమి..సంచలన సర్వే రిపోర్ట్

Donald Trump

Trump Defeat Biden

Trump Defeat Biden :  ఇప్పటికిప్పుడు అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు జరిగితే మాజీ అధ్యక్షుడు,  రిపబ్లికన్ పార్టీ నేత  77 ఏళ్ళ డొనాల్డ్  ట్రంప్ మళ్ళీ గెలుస్తారని తాజా సర్వేలో తేలింది.  ట్రంప్ కు 52 శాతం ఓట్లు పోల్ అయ్యే ఛాన్స్ ఉందని వెల్లడైంది.  45 నుంచి 40 శాతం ఓట్ల తేడాతో ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ ను ట్రంప్ ఓడిస్తారని సర్వేలో (Trump Defeat Biden)  గుర్తించారు.  “హార్వర్డ్ హారిస్ పోల్”  సంస్థ  జూలై 19, 20 తేదీలలో 2,068 ఓటర్లను సర్వే చేసి ఈ అంచనా ఫలితాలను విడుదల చేసింది. ఈ సర్వేలో ప్రస్తుతం అమెరికా వైస్ ప్రెసిడెంట్ గా ఉన్నకమలా హారిస్ కంటే ట్రంప్ కు  47 శాతం ఎక్కువ ఓట్లు వచ్చాయి. సర్వేలో పాల్గొన్న 16% మంది ఓటర్లు ఓటు ట్రంప్ కు వేయాలా ? బైడెన్ కు వేయాలా ? అనేది ఇంకా డిసైడ్ చేసుకోలేదని తెలిపారు.

Also read : BRICS: చైనా సాయంతో బ్రిక్స్‌లో చేరనున్న పాకిస్థాన్..! రష్యాలో జరిగే సమ్మిట్‌లో అతిథి సభ్యదేశంగా పాల్గొనే ఛాన్స్..!

ట్రంప్ తర్వాతి స్థానంలో రాన్ డిసాంటిస్

ఈ సర్వే నివేదిక ప్రకారం దేశ అధ్యక్ష రేసులో డొనాల్డ్  ట్రంప్ తర్వాతి స్థానంలో ఫ్లోరిడా గవర్నర్, రిపబ్లికన్ పార్టీ నేత  రాన్ డిసాంటిస్ (Ronald Dion DeSantis) నిలిచారు. ఈయన 12 శాతం ఓట్లు పొందారు.  ఇక మూడో ప్లేస్ లో నిలిచిన భారత సంతతి వ్యాపార దిగ్గజం, రిపబ్లికన్ పార్టీ నేత  వివేక్ గణపతి రామస్వామికి మద్దతు తెలుపుతామని సర్వేలో పాల్గొన్న 10శాతం మంది ఓటర్లు చెప్పారు. ఒకవేళ రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థిగా డొనాల్డ్  ట్రంప్ ను ప్రకటించకపోతే.. రాన్ డిసాంటిస్ కే  ఆ ఛాన్స్ దక్కొచ్చని  సర్వేలో తేలింది.

Also read : NIA Raids In TamilNadu : తమిళనాడులో 24 చోట్ల ఎన్‌ఐఏ రైడ్స్.. పీఎఫ్‌ఐ ముసుగు సంస్థలపై ఫోకస్

కొత్త అభ్యర్థులు కావాలన్న 70 శాతం మంది