Site icon HashtagU Telugu

Fastest Fifty: ఐపీఎల్‌లో మ‌రో రికార్డు.. 15 బంతుల్లోనే హాఫ్ సెంచ‌రీ..!

Fastest Fifty

Safeimagekit Resized Img (11) 11zon

Fastest Fifty: ముంబైతో మ్యాచ్‌లో ఢిల్లీ ఓపెనర్ ఫ్రేజర్-మెకుర్గ్ రికార్డ్ సృష్టించాడు. 15 బంతుల్లోనే హాఫ్ సెంచరీ (Fastest Fifty) చేశాడు. అందులో 8 ఫోర్లు, 3 సిక్సులు ఉన్నాయి. మరోవైపు హైదరాబాద్ మ్యాచ్‌లో కూడా ఫ్రేజర్ 15 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేయడం విశేషం. ఇక ఈ మ్యాచ్‌లో మొత్తంగా 27 బంతులు ఆడిన ఫ్రేజర్ 11 ఫోర్లు, 6 సిక్సర్లతో 84 పరుగులు చేసి ఔటయ్యాడు. మొద‌టి నుంచే దూకుడు ఆడిన ఫ్రేజ‌ర్ ముంబై బౌల‌ర్ల‌పై విరుచుకుప‌డ్డాడు. ప‌వ‌ర్ ప్లే ఢిల్లీ భారీ స్కోర్ చేయ‌టంలో ఫ్రేజ‌ర్ కీల‌క పాత్ర పోషించాడు.

తొలుత టాస్ గెలిచిన ముంబై

ఐపీఎల్‌-17 సీజన్‌లో భాగంగా ముంబై, ఢిల్లీ జట్లు తలపడనున్నాయి. టాస్‌ గెలిచిన ముంబై తొలుత‌ బౌలింగ్‌ ఎంచుకుంది. ఇప్పటి వరకు ఢిల్లీ 9 మ్యాచ్‌లు ఆడి.. నాలుగింట విజయం సాధించింది. పాయింట్ల పట్టికలో ఆరో స్థానంలో ఉంది. 8 మ్యాచ్‌లు ఆడిన ముంబై.. మూడింట గెలుపొంది తొమ్మిదో స్థానంలో కొనసాగుతోంది.

Also Read: LSG vs RR: నేడు ఐపీఎల్‌లో మ‌రో ర‌స‌వ‌త్త‌ర పోరు.. ల‌క్నో వ‌ర్సెస్ రాజ‌స్థాన్‌..!

హెడ్ ​​టు హెడ్ రికార్డ్

ఇక ముంబై, ఢిల్లీ మధ్య మ్యాచ్ గురించి మాట్లాడుకుంటే ముంబై ఇండియన్స్ బలంగా కనిపిస్తోంది. ఈ రెండు జట్ల మధ్య మొత్తం 34 మ్యాచ్‌లు జరిగాయి. ముంబై ఇండియన్స్ 19 మ్యాచ్‌ల్లో గెలుపొందగా, ఢిల్లీ క్యాపిటల్స్ 15 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. ఈరోజు ఇరు జట్ల మధ్య 35వ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌లో ఢిల్లీ వాతావరణం వేడిగా ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. వర్షం పడే అవకాశం లేదు కాబట్టి వాతావరణం స్పష్టంగా ఉంటుంది. ఢిల్లీలో వాతావరణం వేడిగా, తేమగా ఉంది. మ్యాచ్ సమయంలో గరిష్ట ఉష్ణోగ్రత 40 డిగ్రీలకు దగ్గరగా లేదా అంతకంటే ఎక్కువ ఉండవచ్చు. దీంతో టాస్‌ గెలిచిన ముంబై ముందుగా బౌలింగ్‌ చేయాలని నిర్ణయించుకుంది.

We’re now on WhatsApp : Click to Join