Site icon HashtagU Telugu

Dashrath Samadhi : అయోధ్యలో దశరథ మహారాజు సమాధి వివరాలివీ..

Dashrath Samadhi

Dashrath Samadhi

Dashrath Samadhi : అయోధ్యలో తప్పకుండా చూడదగిన పుణ్యస్థలాల్లో  శ్రీరాముడి తండ్రి దశరథ మహారాజు సమాధి కూడా ఒకటి.  ఇది రామ మందిరానికి కేవలం 15 కిలోమీటర్ల దూరంలో ఉంది. దశరథుని దహన సంస్కారాలను రాజ్యంలో అంతకుముందు ఏ అంత్యక్రియలు జరగని ప్రదేశంలో నిర్వహించాలని భరతుడు అనుకున్నాడని పెద్దలు చెబుతుంటారు. అలాంటి స్థలాన్ని వెతకమని మంత్రులు, ప్రజలను భరతుడు కోరగా.. చివరకు సరయూ నదీ తీరాన బిల్వహరి ఘాట్‌ వద్ద అలాంటి ప్రదేశాన్ని గుర్తించారని అంటారు. అక్కడే దశరథుడిని దహనం చేసి.. ఆయన చితాభస్మాన్ని సమాధిలో భద్రపరచారని చెబుతారు. ప్రస్తుతం రామమందిరం నుంచి బిల్వహరి ఘాట్‌కు నాలుగు లేన్ల రోడ్డును యూపీ సర్కారు నిర్మిస్తోంది. దీనికి ఏ-బీ బంధా రోడ్ అని నామకరణం చేశారు.బిల్వహరి ఘాట్‌ వద్ద దశరథుడి సమాధితో పాటు రామ, లక్ష్మణ, భరత, శతృఘ్ను పాద ముద్రలను తీర్చిదిద్దారు. లంక నుంచి రామలక్ష్మణులు తిరిగి వచ్చాక దశరథుడి సమాధికి వచ్చి ఆశీస్సులను తీసుకున్నారని పురాణాల్లో (Dashrath Samadhi) ప్రస్తావన ఉంది.

We’re now on WhatsApp. Click to Join.

జనవరి 22న జరిగే రామమందిర ప్రారంభోత్సవం కోసం అయోధ్య నగరం సర్వాంగసుందరంగా ముస్తాబవుతోంది. అయోధ్య రామాలయ ప్రారంభానికి తిరుమల శ్రీవారి ఆలయం నుంచి కూడా కానుకలు పంపనున్నారు. అయోధ్యలో రామాలయం ప్రారంభోత్సవం సందర్భంగా శ్రీవారి ఆలయం నుంచి లక్ష లడ్డు ప్రసాదాలను పంపిస్తున్నట్లు టీటీడీ ఈఓ ఎ.వి.ధర్మారెడ్డి తెలిపారు. తిరుమలలో ఫిబ్రవరి 3 నుంచి 5 వరకు పీఠాధిపతులు,మఠాధిపతుల ఆధ్వర్యంలో హిందూ ధార్మిక సదస్సును నిర్వహిస్తున్నట్లు ఆయన వెల్లడించారు.

Also Read: YouTube Hidden Features : యూట్యూబ్‌లోని 5 హిడెన్ ఫీచర్స్.. అన్‌లాక్ ఇలా..

అయోధ్య రామయ్య పాదుకలను, అయోధ్య మందిర ద్వారాలను మన హైదరాబాద్ లోనే తయారు చేశారు. అయోధ్య రామాలయానికి 118 దర్వాజాలు హైదరాబాద్ బోయినపల్లి లోని అనురాధ టింబర్ డిపోలో తయారు చేయించారు. సీతారామ చంద్రుడికి అయోధ్య భాగ్యనగర సీతారామ ఫౌండేషన్ సుమారు రూ.1.03 కోట్ల విలువైన బంగారం పాదుకలను పంపించింది.