Coromandel Express: ఒడిశాలో కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ (Coromandel Express) శుక్రవారం సాయంత్రం బాలాసోర్ జిల్లా పరిధిలోని బహంగా స్టేషన్‌కు రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న పన్పనా సమీపంలో ప్రమాదానికి గురైంది. అందిన సమాచారం ప్రకారం ఒడిశాలో మూడు రైళ్లు ప్రమాదానికి గురయ్యాయి. ఈ ప్రమాదంలో 233 మంది మరణించగా, 900 మంది గాయపడినట్లు సమాచారం.
ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. బెంగళూరు-హౌరా ఎక్స్‌ప్రెస్‌ను కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ ఢీకొంది. ఖరగ్‌పూర్ డీఆర్‌ఎం ఈ విషయాన్ని ధృవీకరించారు. అంతకుముందు కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ పట్టాలు తప్పడంతో బెంగళూరు హౌరా ఎక్స్‌ప్రెస్ ఢీకొంది. ఈ ప్రమాదంలో రెండు రైళ్లకు చెందిన 12 కోచ్‌లు పట్టాలు తప్పాయి. ఈ ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ విచారం వ్యక్తం చేశారు. దీంతో పాటు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌తో మాట్లాడి పరిస్థితిని సమీక్షించారు.
#WATCH | Morning visuals from the spot where the horrific train accident took place in Odisha's Balasore district, killing 207 people and injuring 900 pic.twitter.com/yhTAENTNzJ
— ANI (@ANI) June 3, 2023
Also Read: Big Breaking: ఒడిశాలో ఘోర రైలు ప్రమాదం.. గూడ్స్ రైలును ఢీకొట్టిన కోరమండల్!
ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలో కోరమాండల్ ఎక్స్‌ప్రెస్‌తో పాటు మరో రెండు రైళ్లకు చెందిన పలు కోచ్‌లు పట్టాలు తప్పాయి. ఈ ప్రమాదంలో 230 మందికి పైగా మరణించగా, 900 మందికి పైగా గాయపడ్డారని ఒడిశా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ప్రదీప్ జెనా తెలిపారు. కాగా, ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ, రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ సహా పలువురు నేతలు సంతాపం వ్యక్తం చేశారు.
ఒడిశాలో జరిగిన రైలు ప్రమాదంతో బాధపడ్డానని, మృతుల కుటుంబాలకు నా సానుభూతి తెలియజేస్తున్నానని ప్రధాని మోదీ అన్నారు. రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌తో మాట్లాడి పరిస్థితిని సమీక్షించారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. బాధిత ప్రజలకు అన్ని విధాలుగా సహాయం అందిస్తున్నారు. అదే సమయంలో రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ పరిహారం ప్రకటించారు. మృతుల బంధువులకు రూ.10 లక్షలు, తీవ్రంగా గాయపడిన ప్రయాణికులకు రూ.2 లక్షలు, స్వల్పంగా గాయపడిన వారికి రూ.50 వేలు పరిహారం ప్రకటించామని తెలిపారు.