Site icon HashtagU Telugu

No To Salary : దేశం కోసం శాలరీ వదులుకుంటా.. అధ్యక్షుడి ప్రకటన

No To Salary

No To Salary

No To Salary : పాకిస్తాన్ కొత్త  అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ దేశం కోసం సంచలన నిర్ణయం తీసుకున్నారు. అధ్యక్షుడి హోదాలో తనకు లభించే నెలవారీ వేతనాన్ని వదులుకుంటానని ఆయన ప్రకటించారు. పాకిస్తాన్ ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో తాను శాలరీ తీసుకోలేనని స్పష్టం చేశారు. ఈ మేరకు పాక్ అధ్యక్ష సచివాలయం ఓ అధికారిక ప్రకటన విడుదల చేసింది. ‘‘ప్రస్తుత ఆర్థిక సవాళ్లను దృష్టిలో ఉంచుకొని దేశ అధ్యక్షుడు జర్దారీ తన వేతనాన్ని తీసుకోకూడదని నిర్ణయించుకున్నారు’’ అని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. ఇదే అంశంపై అధ్యక్షుడు జర్దారీకి చెందిన పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ(పీపీపీ) ట్విట్టర్ (ఎక్స్) వేదికగా స్పందించింది. ‘‘దేశానికి సాయం చేయడానికి అధ్యక్షుడు జర్దారీ తన పదవీ కాలంలో ఇకపై ఎలాంటి జీతం తీసుకోరు. ఆర్థిక నిర్వహణ, జాతీయ ఆదాయంపై భారం పడకూడదనే ఉద్దేశంతోనే ఆయన వేతనాన్ని వదులుకుంటున్నారు’’ అని వెల్లడించింది. కాగా, పాకిస్తాన్ హోంమంత్రి మొహ్సిన్ నఖ్వీ సైతం దేశం కోసం నెలవారీ వేతనాన్ని(No To Salary) వదులుకుంటానని ప్రకటించారు.

We’re now on WhatsApp. Click to Join

Also Read : 234 Fighters Killed : 234 మంది ఫైటర్లు హతం.. బార్డర్‌లో హైఅలర్ట్