Site icon HashtagU Telugu

Arctic Ocean Ice : ఆర్కిటిక్‌ సముద్రంలో నెలరోజులు మంచు మాయం!

Arctic Ocean Ice

Arctic Ocean Ice

Arctic Ocean Ice : భూమి ఉత్తర ధ్రువం వద్ద ఆర్కిటిక్‌ మహాసముద్రం ఉంది. 2050 సంవత్సరంకల్లా ఆర్కిటిక్‌ మహాసముద్రంలో ప్రతి ఏడాది నెల రోజుల పాటు తేలియాడే సముద్రపు మంచు కనిపించకపోవచ్చని సైంటిస్టులు తెలిపారు. సముద్ర నీటి మట్టాలు పెరిగి తీర ప్రాంతాల్లో నివసించే ప్రజల జీవితాలకు రిస్క్ పెరుగుతుందని వార్నింగ్ ఇచ్చారు. అంటార్కిటిక్‌, ఆర్కిటిక్‌ మహాసముద్రాల్లో ప్రస్తుతం ఎటు చూసినా మంచే కనిపిస్తోంది. ఈనేపథ్యంలో ఆర్కిటిక్‌ మహాసముద్రంలో తేలియాడే సముద్రపు మంచు ఎంత మేర తగ్గుతుందో తెలుసుకునేందుకు అమెరికాలోని  కొలరాడో యూనివర్సిటీ సైంటిస్టులు నడుం బిగించారు. గతంలో దశాబ్దాల తరబడి చేసిన అధ్యయనాల నివేదికలను ఒకచోట చేర్చి విశ్లేషించారు. టెంపరేచర్స్ ప్రస్తుత స్థాయిలోనే పెరుగుతూపోతే ఈ శతాబ్దం మధ్యకల్లా (2050 సంవత్సరం)  ఆర్కిటిక్‌ సముద్రంలో ప్రతి ఏడాది నెల రోజుల పాటు తేలియాడే సముద్రపు మంచు మాయమయ్యే రిస్క్ ఉందనే అంచనాకు శాస్త్రవేత్తలు వచ్చారు.  మానవ చర్యలు, భూతాపమే ఇందుకు కారణాలు అవుతాయని వెల్లడించారు.

We’re now on WhatsApp. Click to Join

Also Read : TSPSC: గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 పరీక్ష తేదీలను ఖ‌రారు చేసిన టీఎస్‌పీఎస్సీ