Site icon HashtagU Telugu

Apple Music Classic: సంగీత ప్రియుల కోసం ప్రత్యేక యాప్ తయారు చేసిన యాపిల్.

Apple Made A Special App For Music Lovers

Apple Made A Special App For Music Lovers

సంగీత ప్రియుల కోసం ఓ యాప్ ను విడుదల చేయనుంది. సంప్రదాయ సంగీతాన్ని ఇష్టపడే వారి కోసం ‘యాపిల్ మ్యూజిక్ క్లాసిక్’ (Apple Music Classic) పేరుతో యాప్ తెస్తోంది. మార్చి 28న ప్రపంచవ్యాప్తంగా ఈ యాప్ విడుదల అవుతున్నట్టు సమాచారం. ఇప్పటికే యాపిల్ నుంచి మ్యూజిక్ యాప్ ఉండగా.. సంప్రదాయ సంగీత అభిమానుల కోసం కొత్త యాప్ ను పరిచయం చేయనుంది.

ఈ ప్లాట్ ఫామ్ పై సంగీతం వినేందుకు యూజర్లు ప్రత్యేకంగా ఎలాంటి సబ్ స్క్రిప్షన్ కొనుగోలు చేయాల్సిన అవసరం లేదని యాపిల్ తెలిపింది. ఐఫోన్ యూజర్లకే ఇది తొలుత అందుబాటులో ఉంటుంది. అధిక ఆడియో నాణ్యతకు యాప్ సపోర్ట్ చేస్తుంది. యాపిల్ యాప్ స్టోర్ (Apple App Store) లో లిస్ట్ అయిన సమాచారం పరిశీలిస్తే.. యాపిల్ ఐఫోన్ 6, ఆ తర్వాత వెర్షన్ ఫోన్లకు మ్యూజిక్ క్లాసిక్ యాప్ పని చేయనుంది. ఇంగ్లిష్, డచ్, ఫ్రెంచ్, జర్మన్, ఇటాలియన్, పోర్చుగీస్, స్పానిష్ భాషల్లో అందుబాటులోకి వస్తుంది. ఐవోఎస్ వెర్షన్ 15.4 ఆ తర్వాత వెర్షన్ వాడే వారికే ఈ యాప్ పనిచేస్తుంది. క్లాసికల్ మ్యూజిక్ యాప్ లో 50 లక్షల ట్రాక్స్ అందుబాటులో ఉంచినట్టు యాపిల్ తెలిపింది.

Also Read:  Artificial Intelligence: అసలుకు ఎసరు – AI మింగేసే జాబ్స్ ఇవే..