Site icon HashtagU Telugu

Anupama Parameswaran : చెవిటి మూగ అమ్మాయి నుంచి డైలాగ్స్ ఆశిస్తున్నారా.. ఆ వెబ్ సైట్ పై నిప్పులు చెరిగిన అనుపమ పరమేశ్వరన్..!

What is Lilly Aka Anupama Parameswaran Next Step

What is Lilly Aka Anupama Parameswaran Next Step

Anupama Parameswaran మలయాళ భామ అనుపమ పరమేశ్వరన్ కి కోపం వచ్చింది. ఆమె చేసిన ఒక సినిమా గురించి ఒక వెబ్ సైట్ వేసిన ఒక ఆర్టికల్ పై ఫైర్ అవుతూ ఆమె ఆ సదరు వెబ్ సైట్ గురించి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఇంతకీ అసలు విషయం ఏంటంటే ఒక తెలుగు వెబ్ సైట్ అనుపమ నటించిన సిరెన్ సినిమా గురించి ఒక న్యూస్ రాసింది. రవితేజ ఈగల్ లో నటించిన అనుపమ ఆ సినిమాలో హీరోయింగా చేయలేదు.

జయం రవి హీరోగా నటించిన సిరెన్ సినిమాలో ఆమె నటించింది. ఆ సినిమాలో కూడా ఆమెకు అంత స్కోప్ ఉన్న పాత్ర కాదని తెలుస్తుంది. అసలు ఆమెకు డైలాగ్ కూడా లేదట అని ఒక వెబ్ సైట్ ఆర్టికల్ కవర్ చేసింది. అయితే ఆ న్యూస్ కి రెస్పాండ్ అయిన అనుపమ డెఫ్ అండ్ డంబ్ క్యారెక్టర్ నుంచి డైలాగ్ ఆశిస్తున్నారంటే మీ ఎఫర్ట్స్ సూపర్ అని కామెంట్ పెట్టింది.

సదరు వెబ్ సైత్ మా టీం ని కన్ సల్ట్ అయ్యి విషయాన్ని తెలుసుకుంటామని రిప్లై ఇవ్వగా.. నేను ఇది నా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తారు. మీరు ఇలాంటి తప్పుడు వార్తలనే రాస్తారు అది అందరికీ తెలియాలంటూ ఆమె కామెంట్ పెట్టి అది స్క్రీన్ షాట్ తీసి తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసింది.

సెలబ్రిటీస్ విషయంలో మీడియా వెబ్ సైట్స్ ఇలా ఇన్ ఫర్మేషన్ తెలిసి తెలియక తప్పుడు వార్తలు రాస్తారు. అయితే ఈ విషయంపై అనుపమ సీరియస్ గా రియాక్ట్ అయ్యింది.

Also Read : Japan Couple Kurchi Madatapetti Dance : జపాన్ జంట కుర్చీ మడతపెట్టి సాంగ్ డ్యాన్స్.. వీడియో వైరల్..!