Site icon HashtagU Telugu

Beedi in Plane: విమానంలో బీడీ కాల్చిన నిందితుడు. అరెస్ట్ చేసిన పోలీసులు!

Man Smoking Beedi Akasa Air 1280x720

Man Smoking Beedi Akasa Air 1280x720

Beedi in Plane: విమానంలో కొంతమంది అనుచితంగా ప్రవర్తిస్తూ ఉంటారు. విమానంలో గాల్లో ఉండగా డోర్ తెరవడం లాంటివి చేస్తూ ప్రమాదాల కొని తెస్తూ ఉంటారు. అలాగే ఇటీవల విమానంలో ఒక మహిళ మీద మూత్రం పోసిన ఘటన వివాదాస్పదంగా మారింది. దీంతో అతడిపై పోలీసులు కేసు నమోదు చేసి జైలుకు తరలించారు. సదరు ప్రయాణికుడు భవిష్యత్తులో విమానాల్లో ప్రయాణించకుండా నిషేధం విధించారు.

తాజాగా ఓ వ్యక్తి విమానంలో ప్రవర్తించిన తీరు వివాదాస్పదంగా మారింది. విమానంలో బీడీ తాగాడు ఓ వ్యక్తి. విమానంలోని నిబంధనలు తెలియక మరుగుదొడ్డికి వెళ్లి బీడీ తాగాడు. దీంతో అతడిపై కేసు నమోదు చేశారు. అహ్మదాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న విమానంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఆకాశ ఎయిర్ విమానంలో రాజస్థాన్ లోని మార్వార్ ప్రాంతానికి చెందిన 56 ఏళ్ల ప్రవీణ్ కుమార్ అనే వ్యక్తి మంగళవారం అహ్మదాబాద్ లో విమానం ఎక్కాడు.

అయితే విమానంలోని నిబంధనలు తెలియక టాయిలెట్ దగ్గర బిడీ కాల్చాడు. దీనిని గమనించి విమాన సిబ్బంది అతడని అదుపులోకి తీసుకుని బెంగళూరులోని కెంపెగౌడ ఎయిర్ పోర్ట్ లో దిగానే పోలీసులకు అప్పగించారు. దీంతో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని కేసు మోదు చేవారు. ప్రస్తుతం బెంగళూరు సెంట్రల్ జైలుకు అతడికి పంపించారు. విమానంలో ఈ సిగరేట్, స్మోకింగ్ పై నిషేధం అలల్ో ఉంది. అయిేత విమానంలో సిగరేట్, బీడీ తాగకూడదనే విషయం తనకు తెలియదని నిందితుడు చెబుతున్నారు. బస్సులు, ట్రైన్లలో ప్రయాణించే సమయంలో సిగరేట్ తాగుతానని, విమానంలో కూడా తాగవచ్చని అనుకుని తాగినట్లు చెబుతన్నారు. తనకు తెలియక తప్పు చేశానని అంటున్నాడు. అలాగే ఈ ఏడాది ప్రారంభంలో కూడా విమానంలో సిగరేట్ కల్చినందుకు ఇద్దరిని అరెస్ట్ చేశారు.