Site icon HashtagU Telugu

Accenture Delay : జాయినింగ్‌ ఆలస్యమయ్యే కొత్త ఉద్యోగులకు బోనస్‌

Accenture Delay.. Bonus For New Hires Who Delay Joining

Accenture Delay.. Bonus For New Hires Who Delay Joining

Accenture Delay : 19,000 మంది ఉద్యోగులను జాబ్స్ నుంచి తీసేస్తామని ఇటీవల ప్రకటించిన యాక్సెంచర్.. ఇప్పుడు కొత్త ఉద్యోగుల జాయినింగ్‌ను కూడా ఒక సంవత్సరం వరకు ఆలస్యం చేస్తోంది. కొత్త ఉద్యోగుల జాయినింగ్‌ తేదీని ఎప్పుటికప్పుడు పొడిగిస్తోంది. ప్రస్తుతం కొత్త ఉద్యోగుల అవసరం లేనందునే వారి జాయినింగ్‌ తేదీలను పొడిగిస్తూ వస్తున్నట్లు తెలిసింది. పరిస్థితి ఇలా ఉంటుందని ముందే తెలిస్తే తాము మరేదైనా కంపెనీలో చేరేవాళ్లమని.. కానీ యాక్సెంచర్‌ జాయినింగ్‌ను నెలల తరబడి ఆలస్యం చేస్తూ ఇబ్బంది పెడుతోందని అభ్యర్థులు నిట్టూరుస్తున్నారు.

తమ క్లయింట్ల అవసరాలకు తగ్గట్టుగా కొత్త ఉద్యోగుల జాయినింగ్‌ తేదీలను సర్దుబాటు చేస్తున్నామని యాక్సెంచర్ ప్రతినిధి రాచెల్ ఫ్రే ఈమెయిల్ ద్వారా తెలియజేశారు. ఇలా ఎంతోమంది అభ్యర్థులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ జాప్యం ఇలాగే కొనసాగుతుందా అనే విషయాలపై ప్రస్తుతానికి స్పష్టత లేదు.

యాక్సెంచర్ (Accenture) తనకు యూకేలో కన్సల్టింగ్ ఉద్యోగం ఇచ్చిందని, వచ్చే జూన్‌లో ఉద్యోగంలో చేరాల్సి ఉండగా జాయినింగ్‌ తేదీని అక్టోబరుకు మార్చిందని ఇటీవల గ్రాడ్యుయేషన్‌ పూర్తిచేసిన ఓ అభ్యర్థి ప్రముఖ వార్తా సంస్థకు తెలియజేశాడు. జాయినింగ్‌ తేదీని మళ్లీ 2024 సంవత్సరం ప్రారంభానికి మార్చిందని ఆవేదన వ్యక్తం చేశాడు. దీంతో అతడు ఆ ఉద్యోగం వదిలివేయాలని నిర్ణయించుకున్నారు.

అయితే జాయినింగ్‌ ఆలస్యానికి యాక్సెంచర్ రిక్రూటర్ ఆ ఈమెయిల్‌లో క్షమాపణలు కోరారు. ఇలా జాయినింగ్‌ ఆలస్యం అయిన వారికి కంపెనీ అదనపు బోనస్ ఇవ్వనున్నట్లు తెలిసింది. యాక్సెంచర్‌లో జాయినింగ్‌ ఆలస్యం కావడం పట్ల విసుగు చెందిన కొందరు అభ్యర్థులు రెడ్డిట్ ఫోరమ్‌లలో కూడా తమ నిరాశను వ్యక్తం చేశారు.

సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగాలు

హైదరాబాద్‌తోపాటు దేశవ్యాప్తంగా ఉన్న వివిధ శాఖల్లో అప్లికేషన్‌ డెవలప్‌మెంట్‌ అసోసియేట్‌ పోస్టుల భర్తీకి యాంక్సెంచర్‌ సంస్థ ప్రకటన విడుదల చేసింది. దీని అర్హత విషయానికి వస్తే..బీఈ/ బీటెక్‌/ ఎంఈ/ ఎంటెక్‌/ ఎంసీఏ/ ఎంఎస్సీ (సీఎస్‌ఈ/ ఐటీ) ఉత్తీర్ణత ఉండాలి. ఇక  0-11 నెలలు పని అనుభవం ఉండాలి.జీతభత్యాలు ఏటా రూ.4,61,200 చెల్లిస్తారు. దీనికి ఎంపికయ్యే వారు క్లయింట్లకు అవసరమైన టెక్నాలజీలను అభివృద్ధి చేయాలి.క్లయింట్ అవసరాలకు అనుగుణంగా సాంకేతిక పరిష్కారాలను రూపొందించాలి.ఆటోమేషన్ సొల్యూషన్స్, కొత్త ఫంక్షనాలిటీ, టెక్నాలజీల అభివృద్ధిలో పాల్గొనాలి.

ఎంపిక విధానం: అసెస్‌మెంట్‌ ప్రాసెస్‌, మాక్‌ అసెస్‌మెంట్‌, కాగ్నిటివ్‌, టెక్నికల్‌ అసెస్‌మెంట్‌, కోడింగ్‌ అసెస్‌మెంట్‌, కమ్యునికేషన్‌ అసెస్‌మెంట్‌, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది.

Also Read:  Jacqueline Fernandez: ఏరియల్ యోగా తో తన టోన్డ్ ఫిగర్‌ని ప్రదర్శిస్తూ కాక రేపుతున్న జాక్వెలిన్ ఫెర్నాండెజ్