అమెరికాలో పశ్చిమ పనామా ప్రాంతంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ బస్సు అదుపుతప్పి లోయలో పడింది. ఈ ప్రమాదంలో 39 మంది మరణించగా (39 Dead) మరో 20 మందికి తీవ్ర గాయాలయ్యాయి. దేశంలోకి అక్రమంగా ప్రవేశించిన వలసదారులను ఓ శిబిరానికి తలరిస్తున్న సమయంలో ఈ బస్సును మరో బస్సు ఢీ కొట్టడంతో ఈ ఘోరం జరిగిందని, క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించామని అధికారులు వెల్లడించారు.
Also Read: Earthquake: ఫిలిప్పిన్స్‌లో భారీ భూకంపం.. పరుగులు తీసిన జనం
బుధవారం పనామాలో వలస కూలీలతో కూడిన బస్సు.. మినీ బస్సును ఢీకొట్టింది. ఈ సమయంలో, సుమారు 39 మంది వలసదారులు మరణించారు. ప్రమాదంలో పలువురు గాయపడినట్లు సమాచారం. సమాచారం ప్రకారం.. బస్సులో 60 మందికి పైగా వలసదారులు ఉన్నారు. బుధవారం తెల్లవారుజామున ప్రమాదం జరిగింది. బండరాయి బస్సుపై పడిందని పలు నివేదికల్లో ప్రమాదానికి కారణమని చెబుతున్నారు. ప్రమాదంపై అధ్యక్షుడు లారెంటినో కార్టిజో విచారం వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు అన్ని విధాలా సాయం అందించేందుకు పనామా ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఆయన ట్విట్టర్‌లో రాశారు. క్షతగాత్రులకు చికిత్స అందిస్తున్నారు. గత దశాబ్దంలో పనామాలో వలసదారులు ప్రాణాలు కోల్పోయిన ఘోర ప్రమాదం ఇదే.