Site icon HashtagU Telugu

Meesho Layoffs: “మీషో”లో 251మందికి ఉద్వాసన.. 9 నెలల శాలరీతో సెటిల్మెంట్ !

Meesho

Meesho

ప్రముఖ కంపెనీల్లో ఉద్యోగుల తొలగింపు పర్వం కొనసాగుతోంది. ఈక్రమంలోనే ఈ-కామర్స్ సంస్థ “మీషో” (Meesho) 251 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు శుక్రవారం ప్రకటించింది. జాబ్ కోల్పోయిన వారికి తమ పూర్తి మద్దతు ఉంటుందని తెలిపింది. వారికి అవకాశం, హోదా ఆధారంగా 2.5 నెలల నుంచి 9 నెలలకు సంబంధించిన వన్ టైమ్ సెటిల్మెంట్ చెల్లింపు మొత్తాన్ని అందిస్తామని వెల్లడించింది. బీమా ప్రయోజనాలు, జాబ్ ప్లేస్‌మెంట్ సపోర్ట్, ఈసాప్స్ ను వెస్టింగ్‌ చేసుకునే వెసులుబాటును కూడా కల్పిస్తామని స్పష్టం చేసింది. కంపెనీ సుస్థిరమైన లాభదాయకతను సాధించడానికి దృఢమైన సంస్థాగత నిర్మాణం కోసమే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని వివరించింది. ” బాధిత ఉద్యోగులందరికీ నోటీసు వ్యవధికి మించి ఒక నెల అదనపు తొలగింపు వేతనం కూడా ఇస్తాం . వారు కంపెనీలో ఉన్న కాలంతో సంబంధం లేకుండా ESOPలు పొందుతారు ” అని మీషో (Meesho) వ్యవస్థాపకుడు , సీఈవో విదిత్ ఆత్రే ఉద్యోగులకు పంపిన ఒక అంతర్గత ఈమెయిల్‌లో తెలిపారు. 2020 నుంచి 2022 మధ్య కాలంలో కొవిడ్ వల్ల తమ కంపెనీ 10 రెట్లు వృద్ధి చెందిందని అన్నారు. ప్రాజెక్ట్ రెడ్‌బుల్‌లో భాగంగా మీషో (Meesho ను లాభదాయకత దిశగా నడిపే క్రమంలోనే ఈ ఉగ్యోగ కోతలు చేశామని పేర్కొన్నారు. మీషో నిర్మాణంలో సహకారం అందించినందుకు ఉద్వాసన పొందిన ఉద్యోగులకు విదిత్ ఆత్రే కృతజ్ఞతలు తెలిపారు.

ALSO READ : Government Jobs for Engineers: నెలకు రూ.1.80 లక్షల జీతం.. ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్‌కు గవర్నమెంట్ జాబ్స్