Site icon HashtagU Telugu

Jagadish Reddy: మోదీ విధానాలను రేవంత్ ఫాలో అవుతున్నాడు

Jagadish Reddy

Jagadish Reddy

Jagadish Reddy: మాజీ మంత్రి, ఎమ్మెల్యే జి .జగదీశ్ రెడ్డి,ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి ,ఎమ్మెల్సీ తాత మధు తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మా పార్టీ ఎమ్మేల్యేలు పోచారం శ్రీనివాసరెడ్డి, ఎం .సంజయ్ కుమార్ బిఆర్ఎస్ బి ఫామ్ పై గెలిచి కాంగ్రెస్ లో చేరారు. వారి సభ్యత్వం రద్దు కావాల్సి ఉంది. వారిపై పిటిషన్ ఇవ్వాలని స్పీకర్ ను సమయం కోరాం. ఈరోజు లేదా రేపు సమయమిస్తానని స్పీకర్ చెప్పారు. గతంలో పార్టీ మారిన ముగ్గురు ఎమ్మెల్యేలతో పాటు వీరిద్దరి సభ్యత్వాలు రద్దు కావాలి. స్పీకర్ సమయం ఇస్తారని భావిస్తున్నామని వారు అన్నారు.

‘‘పాంచ్ న్యాయ్ తీర్మానం ప్రకారం ఫిరాయింపులు ప్రోత్సహించవద్దని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి చెబుతున్నారు. రాహుల్ బిజెపిపై దాడి చేస్తుంటే ఇక్కడ రేవంత్ బిజెపికి తోకలా వ్యవహరిస్తున్నాడు. మోదీ విధానాలను రేవంత్ ఫాలో అవుతున్నాడు. జీవన్ రెడ్డి మాట మీద నిలబడాలి. మేము ఏ ఒక్కరిని వదిలిపెట్టం. ప్రజల ముందు దోషిగా నిలబెడతం. స్పీకర్ న్యాయంగా ప్రవర్తిస్తారని ఆశిస్తున్నాం. రేవంత్ భయంలో ఉన్నాడు. కాంగ్రెస్ విధానాలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నాడు’’ బీఆర్ఎస్ నాయకులు అన్నారు.