Site icon HashtagU Telugu

Priya Bhavani Shankar: ఆ పేరుతో శరీరాన్ని ప్రదర్శించడం ఇష్టం లేదు: ప్రియా భవానీ

Priya Bhavani Shankar

Priya Bhavani Shankar

గ్లామర్‌ పాత్రలకు దూరంగా ఉండి, తనదైన అందం మరియు అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకుంటోన్న అందాల తార ప్రియా భవాని శంకర్‌(Priya Bhavani Shankar). 2017లో తమిళ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఈ బ్యూటీ, తన నటనతో మంచి గుర్తింపు పొందింది. తమిళంలో వరుసగా సినిమాల్లో నటించే అవకాశాలను దక్కించుకుంది. 2022లో విడుదలైన కళ్యాణం కమణీయం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది. ఈ తొలి సినిమాతోనే ఆమె తన అందం మరియు నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. తాజాగా డిమోంటీ కాలనీ 2తో మరోసారి తెలుగు ప్రేక్షకులను పలకరించింది. ప్రస్తుతం బ్లాక్‌ సినిమాతో ప్రేక్షకులను పలకరిస్తున్నది.

ఈ నేపథ్యంలో, ఇటీవల మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ముఖ్యంగా గ్లామర్‌ పాత్రలపై తన అభిప్రాయాన్ని పంచుకుంది. ఫ్యాషన్‌ పేరుతో శరీరాన్ని ప్రదర్శించడం తనకు ఇష్టం లేదని స్పష్టం చేసింది ప్రియా భవాని శంకర్‌(Priya Bhavani Shankar). తన శరీరాన్ని ఎప్పుడూ ఒక వస్తువుగా భావించనని వెల్లడించింది. ప్రేక్షకులను ఆకర్షించడానికి గ్లామర్‌గా ఉండటం ఆమెకు నచ్చదని, అలాంటి పాత్రలను ఎలాంటి పరిస్థితుల్లోనూ అంగీకరించనని చెప్పింది.

ఇక.. కెరీర్‌ పరంగా ఎప్పుడూ వెనక్కి తిరిగి చూడకూడదని, అందుకు అనుగుణంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటానని ప్రియా భవానీ శంకర్‌(Priya Bhavani Shankar) వెల్లడించింది. నెగిటివ్‌ రోల్‌లో నటించడానికి తాను వెనుకాడబోను, ఎందుకంటే అది నా వృత్తి అని స్పష్టం చేసింది. ఒక హీరోయిన్‌గా ఫ్యాషన్‌ పేరుతో కొన్నింటిని ప్రమోట్‌ చేయలేనని కూడా ఆమె తన మనసులో మాట బయటపెట్టింది.

ప్రియా కెరీర్‌ తొలినాళ్ల నుంచి గ్లామర్‌ పాత్రలకు దూరంగా ఉంటూ వస్తోంది. గతంలో కూడా గ్లామర్‌ పాత్రలపై తన అసంతృప్తిని వ్యక్తం చేసింది. ప్రేక్షకులు కూడా తనను గ్లామర్‌ పాత్రల్లో చూడాలనుకుంటారంటే, ఆమె మాత్రం అందుకు భిన్నంగా భావిస్తూ గతంలో ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.