Madras High Court: మద్రాస్ హైకోర్టు కీలక తీర్పు.. భర్తకు ముస్లిం మహిళ విడాకులు..

తలాక్‌లో (Talaq) భర్త భార్యకు చెబితే.. ఖులాలో భార్య భర్తకు చెబుతుందన్న మాట. అయితే, ఈ ఖులా కోసం ప్రైవేటు

ముస్లిం మహిళల విడాకుల వ్యవహారంలో మద్రాస్ హైకోర్టు (Madras High Court) కీలక తీర్పు వెలువరించింది. షరియత్ కౌన్సిల్ వంటి ప్రైవేటు సంస్థలకు బదులుగా కుటుంబ న్యాయస్థానాన్ని ఆశ్రయించడం ద్వారా ముస్లిం మహిళల ‘ఖులా’ ద్వారా వివాహాన్ని రద్దు చేసుకునే హక్కును ఉపయోగించుకోవచ్చని మద్రాస్ హైకోర్టు పేర్కొంది.

సింపుల్‌గా చెప్పాలంటే.. ఇది తలాక్‌కు మరో రూపం. తలాక్‌లో భర్త భార్యకు చెబితే.. ఖులాలో భార్య భర్తకు చెబుతుందన్న మాట. అయితే, ఈ ఖులా కోసం ప్రైవేటు సంస్థలను ఆశ్రయించకుండా నేరుగా కోర్టును ఆశ్రయించడం ద్వారా కూడా ముస్లిం మహిళ భర్త నుంచి విడాకులు పొందొచ్చని మద్రాస్ హైకోర్టు (Madras High Court) స్పష్టం చేసింది.

ప్రైవేటు సంస్థలు కోర్టులు కావని, వివాదాలను పరిష్కరించే మధ్యవర్తులు కానీ కావని కోర్టు స్పష్టం చేసింది. న్యాయస్థానాలు గతంలో ఇలాంటి వాటిపై విరుచుకుపడిన విషయాన్ని ఈ సందర్భంగా కోర్టు గుర్తు చేసింది. కాబట్టి కుటుంబ న్యాయస్థానాలను ఆశ్రయించడం ద్వారా చట్టబద్ధంగా విడాకులు పొందొచ్చని పేర్కొంది.

ప్రైవేటు సంస్థలు అందించే ఖులా సర్టిఫికెట్లకు ఇకపై విలువ ఉండదని జస్టిస్ సి.శరవణన్ స్పష్టం చేశారు. ఖులా సర్టిఫికెట్‌ను రద్దు చేయాలంటూ ఓ వ్యక్తి దాఖలు చేసిన రిట్ పిటిషన్‌ను విచారించిన కోర్టు ఈ మేరకు తీర్పు చెప్పింది. అందులో భాగంగా 2017లో తమిళనాడులోని తౌహీద్ జామత్ జారీ చేసిన ఖులా సర్టిఫికెట్‌ను కోర్టు రద్దు చేసింది.

Also Read:  Mahashivratri 2023: 2023లో మహాశివరాత్రి ఎప్పుడు వచ్చింది?