Site icon HashtagU Telugu

CONGRESS LEADS 108 :108 స్థానాల్లో కాంగ్రెస్ ఆధిక్యం.. ఢిల్లీలో ముందస్తు సంబురాలు

Karnataka Election Result

Karnataka Election Result

కర్ణాటక ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ మొదలుకాగానే.. 108 స్థానాల్లో కాంగ్రెస్ (congress leads 108) పార్టీ ఆధిక్యంలో ఉందని ప్రాథమిక సమాచారం(karnataka election result) బయటికి వచ్చింది. దీంతో న్యూఢిల్లీల్లోని కాంగ్రెస్ ప్రధాన కార్యాలయం వద్ద పార్టీ శ్రేణులు సంబురాలు చేసుకున్నాయి. ఎగ్జిట్ పోల్స్ లో కూడా కాంగ్రెస్ పార్టీ అత్యధిక సీట్లను గెల్చుకొని(karnataka election result) అతిపెద్ద పార్టీగా ఆవిర్భవిస్తుందనే అంచనాలు వెలువడిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్ కు విజయ అవకాశాలు ఉన్నాయనే సంకేతాలు వెలువడటంతో.. తమ ఎమ్మెల్యేలు అందరూ వెంటనే బెంగళూరుకు వచ్చేయాలని ఆ పార్టీ ఆదేశాలు జారీ చేసింది. అంతకుముందు ఇవాళ ఉదయం 8 గంటలకు కర్ణాటకలోని మొత్తం 34 కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమైంది. తొలుత పోస్టల్ బ్యాలెట్, ఓట్ ఫ్రమ్ హోమ్ ఓట్లను లెక్కించారు. ఇది ముగిశాక.. ఈవీఎంలలో ఉన్న ఓట్లను లెక్కించడం స్టార్ట్ చేశారు. మధ్యాహ్నం వరకు తుది ఫలితాలు(karnataka election result) వచ్చేస్తాయి.

(ఉదయం 9.40 గంటలకు : 74 స్థానాల్లో కాంగ్రెస్, 45 స్థానాల్లో బీజేపీ, 16 స్థానాల్లో జేడీఎస్ లీడ్ లో ఉన్నాయి. )

also read : karnataka election result : ఓట్ల కౌంటింగ్ స్టార్ట్.. తీవ్ర ఉత్కంఠ

113 స్థానాలు గెలిస్తే..

ఈ ఎన్నికల రిజల్ట్ పై దేశవ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కర్ణాటక రాజధాని బెంగళూరులో ఈరోజు ఉదయం 6 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు 144 సెక్షన్ విధించారు. కర్ణాటకలో మొత్తం అసెంబ్లీ స్థానాలు 224 కాగా 113 స్థానాలు గెలిచిన పార్టీ అధికారం చేపడుతుంది. బీజేపీ , కాంగ్రెస్ మధ్య తీవ్ర పోటీ ఉంటుందని ఎగ్జిట్ పోల్ ఫలితాలను బట్టి తెలుస్తోంది. ఒకవేళ హంగ్ వస్తే మాజీ ప్రధాని దేవెగౌడకు చెందిన జేడీఎస్ పార్టీ కీలకంగా మారనుంది.