Passenger Drives Plane : ఆ విమానం పైలట్ వయసు 79 ఏళ్లు..
విమానాన్ని నడుపుతుండగా ఆయనకు ఆరోగ్యం దెబ్బతింది..
దీంతో విమానం కంట్రోల్ తప్పుతుండగా.. ఆ పక్కనే ఉన్న 68 ఏళ్ల మహిళా ప్రయాణికురాలు ముందుకొచ్చింది..
విమానాన్ని తన కంట్రోల్ లోకి తీసుకుంది.
ఆమె విమానాన్ని సేఫ్ గా ల్యాండ్ అయితే చేయించగలిగింది.
కానీ ఈక్రమంలో విమానం ఫ్యాన్ విరిగిపోయింది!!
ఈ ప్రమాద ఘటన అమెరికాలోని మసాచుసెట్స్ దీవిలో జరిగింది. జూలై 15న (శనివారం) జరిగిన ఈ ప్రమాదం వివరాలు ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి. పైపర్ మెరీడియన్ మోడల్ కు (Piper Meridian airplane) చెందిన ఈ విమానాన్ని ల్యాండింగ్ చేసే క్రమంలో మహిళా ప్రయాణికురాలు ల్యాండింగ్ గేర్ ను వాడలేదని.. అందువల్లే విమానం క్రాష్ ల్యాండింగ్ జరిగిందని పోలీసులు గుర్తించారు. పైలట్‌ను వెంటనే బోస్టన్ ఆసుపత్రిలో చేర్చారు. అక్కడ అతను చికిత్స పొందుతున్నాడు. అయితే, మహిళా ప్రయాణికురాలికి(Passenger Drives Plane) ఎటువంటి గాయాలు కాలేదు. స్థానిక ఆసుపత్రి నుంచి ఆమెను డిశ్చార్జ్ చేశారు. ఈ ప్రమాదంపై పోలీసులు, ఏవియేషన్ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. పైపర్ మెరీడియన్ విమానం చాలా చిన్నది. ఇందులో 1 పైలట్, ఐదుగురు ప్యాసింజర్లు మాత్రమే జర్నీ చేయగలుగుతారు. సెలబ్రిటీలు లోకల్ టూర్స్ కోసం ఈ విమానాల్ని అమెరికాలో నిత్యం వాడుతుంటారు. ఈ విమానం గురించి ఇంకా తెలుసుకోవాలంటే ఇక్కడ క్లిక్ చేయండి. అంతకుముందు జూలై 8న అమెరికాలోని కాలిఫోర్నియాలో విమానం కూలిపోయిన ఘటనలో ఆరుగురు ప్రయాణికులు మరణించారు. వారం వ్యవధిలో ఇది రెండో విమాన ప్రమాదం.