Mangalavaram Review : రివ్యూ : మంగళవారం
Mangalavaram Review ఆరెక్స్ 100 సినిమాతో దర్శకుడిగా తన మొదటి సినిమాతోనే షాక్ ఇచ్చిన అజయ్ భూపతి తన సెకండ్ సినిమా మహా సముద్రం ఆశించిన
- By Ramesh Published Date - 08:05 AM, Fri - 17 November 23

నటీనటులు : పాయల్ రాజ్‌పూత్, నందిత శ్వేత, దివ్య పిళ్లై, అజ్మల్ అమిర్, రవీంద్ర విజయ్, కృష్ణ చైతన్య, అజయ్ ఘోష్
సంగీతం : అజనీష్ లోకనాథ్
సినిమాటోగ్రఫీ : శివేంద్ర దాశరథి
నిర్మాత : స్వాతిరెడ్డి గునుపాటి, సురేష్ వర్మ
కథ-స్క్రీన్‌ప్లే-దర్శకత్వం : అజయ్ భూపతి
Mangalavaram Review ఆరెక్స్ 100 సినిమాతో దర్శకుడిగా తన మొదటి సినిమాతోనే షాక్ ఇచ్చిన అజయ్ భూపతి తన సెకండ్ సినిమా మహా సముద్రం ఆశించిన స్థాయి ఫలితాన్ని ఇవ్వలేదు. తన థర్డ్ అటెంప్ట్ గా మంగళవారం సినిమా చేశాడు. డిఫరెంట్ కథ.. కొత్త సెటప్ తో తెరకెక్కిన మంగళవారం సినిమా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమా ఎలా ఉందో ఈ సమీక్షలో చూద్దాం.
We’re now on WhatsApp : Click to Join
కథ :
అక్రమ సంబంధం పెట్టుకున్న ఒక జంట ప్రాణాలు కోల్పోతారు. గుర్తు తెలియని వ్యక్తి ఊరి గోడలపై వారి పేర్లని రాస్తాడు. మహాలక్ష్మిపురంలో ఇలానే మరో జంట కూడా ప్రాణాలు కోల్పోతుంది. అవి ఆత్మహత్యలు కావు హత్యలని ఊరు జనాలు నమ్ముతారు. ఊరికి కొత్తగా వచ్చిన ఎస్సై మాయ (నందిత శ్వేత) కూడా అవి ఆత్మహత్యలు కావని నిరూపించాలని అనుకుంటుంది. ఆ బాడీలను పోస్ట్ మార్టం చేయించాలని ప్రయత్నిస్తే ఆ ఊరి జమిందారు పకాశం బాబు (చైతన్య కృష్ణ) అడ్డుకుంటాడు. మొదటి సారి అతని మాట విని వదిలి పెట్టిన ఎస్సై రెండోసారి మాత్రం అతన్ని ఎదురించి పోస్ట్ మార్టం చేయిస్తుంది. ఊరి గోడలపై రాతలు రాస్తున్న అజ్ఞాత వ్యక్తి ఎవరో కనిపెట్టాలని ఊరి జనమంతా రంగంలోకి దిగుతారు. ఊళ్లో జరిగినవి ఆత్మహత్యలా..? హత్యలా..? ఈ చావుల వెనక ఉన్న లక్ష్యం ఏంటి..? వీటికి ఆ ఊరి నుంచి వెలివేయబడ్డ శైలజ (పాయల్ రాజ్ పుత్) కి సంబంధం ఏంటి..? అసలు శైలజ కథ ఏంటి అన్నది ఈ సినిమా కథ.
కథనం – విశ్లేషణ :
మంగళవారం సినిమా అన్ని జోనర్ లను టచ్ చేసిన సినిమా. థ్రిల్లర్ గా మొదలై మధ్యలో హారర్ టచ్ ఇచ్చి చివరగా రివెంజ్ డ్రామాగా ముగిస్తుది. అంతేకాదు చివర్లో ఒక మెసేజ్ కూడా ఇచ్చాడు డైరెక్టర్. మహిళలకు సంబంధించిన సందేశం దాని కోసమే అల్లుకున్న కథ ఇది. అక్రమ సంబంధాల వ్యవహారం కథనాయికకు ఉన్న సమస్య లాంటివి ఫ్యామిలీ ఆడియన్స్ ని ఇబ్బంది పెట్టొచ్చు.
విరామం వరకు లీడ్ రోల్ కనిపించదు. అసలు కథ అంతా సెకండ్ హాఫ్ లోనే ఉంటుందిఒ. అయితే ఫస్ట్ హాఫ్ ఎక్కడ బోర్ కొట్టించడకుండా చేశాడు డైరెక్టర్ అజయ్. శైలు చిన్నతనం ఎపిసోడ్ తో సినిమా మొదలవుతుంది. రవితో చిన్ననాటి ప్రేమ.. తండ్రితో ఇబ్బందులు.. ఇవన్ని చూపించారు. ఆ తర్వాథ కథ ప్రెజంట్ లోకి వస్తుంది. మహాలక్ష్మిపురం ఊర్లో పాత్రలు వారి వ్యక్తిత్వాలు సినిమాను నడిపిస్తాయి. అక్రమ సంబంధాలు పెట్టుకున్న జంటల పేర్లు అజ్ఞాత వ్యక్తి గోడలపై రాయడం.. మరుసటి రోజే ఆ జంటలు మరణించడం గ్రామ దేవత ఇష్టమైన మంగళవారం రోజునే అవి జరగడం ఆసక్తిగా అనిపిస్తుంది.
సెకండ్ హాఫ్ శైలు ఫ్లాష్ బ్యాక్ తో స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ హాఫ్ తో పోల్చితే కథ కాస్త నెమ్మదిగా సాగినట్టు అనిపిస్తుంది. పతాక సన్నివేశాల్లో మంచి ట్విస్ట్ తో ఆసక్తికరంగా తీర్చిదిద్దారు. అయితే సినిమా ముగించిన విధానం ఇంకాస్త బెటర్ గా ఉంటే బాగుండేది.
నటీనటులు :
శైలజ అలియాస్ శైలు పాత్రలో పాయల్ తన బెస్ట్ ఇచ్చింది. సినిమాలో తన పాత్రకు తను పూర్తి స్థాయిలో న్యాయం చేసింది. అజ్మీర్ కూడా ఉన్నంతలో బాగా చేశాడు. అజయ్ ఘోష్ లక్ష్మణ్ కామెడీ కాస్త రిలీఫ్ అనిపిస్తుంది. ఇక సినిమాలో పాత్రలన్నీ పరిధి మేరకు నటించి మెప్పించారు.
సాంకేతికవర్గం :
అజనీష్ లోకనాథ్ మ్యూజిక్ సినిమాకు బాగా సపొర్ట్ చేసింది. సినిమాటోగ్రఫీ కూడా బాగుంది. దర్శకుడు అజయ్ భూపతి క్యారెక్టర్ డ్రైవెన్ తో కొత్త కథ రాసుకున్నాడు. అయితే దాన్ని 100 శాతం చూపించడంలో ఫెయిల్ అయ్యాడు. కొన్ని సీన్స్, మ్యూజిక్, నటీనటుల పర్ఫార్మెన్స్ సినిమాను ఓకే అనిపిస్తాయి. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా బాగున్నాయి.
బాటం లైన్ :
మంగళవారం.. ఓకే ఓకే..!