Profit in Business: మీ వ్యాపారం లేదా సంస్థలో లాభాలను పొందడానికి మీ పని ప్రదేశంలో ఈ దిశలో కూర్చోండి

కార్యాలయాలు, వ్యాపార స్థలాలు కూడా వాస్తు - నియమానుసారం ఉన్నపుడే లక్ష్మీ కటాక్షం ఉంటుందని శాస్త్రం చెబుతోంది. ఆ నియమాలు ఏమిటో తెలుసుకుందాం..

అందరూ డబ్బు సంపాదించాలనే అనుకుంటారు. ఉద్యోగమో, వ్యాపారం చేసి డబ్బు ఎంత సంపాదిస్తున్నామనే దాన్ని బట్టే మన జీవితం ఎంత వరకు విజయవంతంగా ఉందనే దాన్ని అంచనా వేస్తారు ఎవరైనా. ఇలా జీవితాన్ని విజయవంతంగా నడిపేందుకు మన సనాతన శాస్త్రాలు మనకు రకరకాల నియమాలు సూచించాయి. వాస్తు కూడా అలాంటి నియమాల శాస్త్రమే. వాస్తు నిర్మాణ శాస్త్రం మాత్రమే కాదు. వాస్తు నియమానుసారం నివసించే ప్రదేశాలు, పని ప్రదేశాలు అన్ని చోట్ల ఏర్పాటు చేసుకోవడం విజయానికి సోపానం వేస్తుంది. సాధారణంగా నివాస ప్రాంతాల నిర్మాణ సమయంలో వాస్తు గురించి తీసుకునే శ్రద్ధ.. పని ప్రదేశాల నిర్మాణ సమయంలో పెద్దగా లెక్క చేయరు. కానీ కార్యాలయాలు, వ్యాపార స్థలాలు కూడా వాస్తు నియమానుసారం ఉన్నపుడే లక్ష్మీ కటాక్షం ఉంటుందని శాస్త్రం చెబుతోంది. ఆ నియమాలు ఏమిటో తెలుసుకుందాం.

ఏం చేసినా కలిసి రాకపోవడం, వ్యాపారంలో ఎలాంటి పురోగతి లేకపోవడం, ఆర్థిక కష్టాలు వీడకపోవడం వంటి వాటి వెనుక వాస్తుకు సంబంధించిన కారణాలు ఉన్నాయేమో ఒకసారి చూసుకోవాలి. అదేమిటో నిర్థారణ చేసుకుంటే వాస్తు దోషాలను సకాలంలో తొలగించడం అవసరం. వ్యాపార స్థలం లేదా ఆఫీసు వంటి పని చేసే స్థలాల్లో సరైన దిశలో కూర్చుని పని చేసుకోవడం కూడా ప్రభావాన్ని చూపుతుందని పండితులు అంటున్నారు.

మీ కంపెనీకి మీరే మేనేజింగ్ డైరెక్టర్ అయితే వ్యాపారం అనుకున్నట్టు సాగడం లేదా? ఆశించిన లాభాలు (Profit) కనిపించడం లేదా? కార్యాలయం లేదా వ్యాపార స్థలంలో మీరు సరైన దిశలో కూర్చోవడం లేదేమో బహుషా. లేదా మీరు కూర్చుంటున్న గదికి వాస్తుదోషాలు ఉన్నాయేమో అందువల్ల మీ కష్టానికి తగిన ఫలితం రావడం లేదేమో అనేది ఒకసారి తెలుసుకోవాలి.

కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ గది దక్షిణం లేదా పశ్చిమ దిక్కున ఉండడం శుభప్రదం. ఒకవేళ ఈ విధంగా లేకపోతే అటువైపుగా ఏర్పాటు చేసుకోవడం అవసరం. ఆగదిలో మీరు కూర్చున్నపుడు ఉత్తరం లేదా తూర్పు దిక్కుగా మీ ముఖం ఉండేట్టుగా సీటింగ్ అరేంజ్ చేసుకోవాలి. మేనేజింగ్ డైరెక్టర్ గదిలో టెబుల్ కుర్చిలు ఈ విధంగా ఏర్పాటు చేసుకోవాలి. ఇలా ఏర్పాటు చేసుకున్నపుడు తప్పకుండా మీ టర్నోవర్ త్వరగా పెరుగుతుండడం చూసి మీకే ఆశ్చర్యం కలుగుతుంది.

ఆపీసులో విజిటర్స్ రూమ్ ఏర్పాటు చెయ్యలేకపోతే మేనేజింగ్ డైరెక్టర్ క్యాబిన్ బయట వైపు తూర్పు లేదా ఉత్తరం వైపు గొడదగ్గర కూర్చీలు ఏర్పాటు చెయ్యాలి. అప్పుడు అక్కడ కూర్చున్న వారి ముఖం పశ్చిమం లేదా దక్షిణం వైపుగా ఉంటుంది. విజిటర్స్ కూర్చునే దిశకు కూడా వాస్తు తప్పనిసరి. కార్యాలయంలో పనిచేసే ఇతర ఉద్యోగులు వారి స్థానాన్ని అనుసరించి పశ్చిమ, దక్షిణ దిక్కులలో ఆధికారుల క్యాబిన్ కు దగ్గరగా కూర్చోవాలి.

మీది దుకాణం అయితే అమ్మకానికి పెట్టే వస్తువులు దక్షిణం, పడమర, వాయవ్యం దిశ అంటే పడమర ఉత్తర గోడలు కలుసుకునే మూలలో వస్తువులు ఉంచాలి. తూర్పు, ఉత్తరాల మధ్య అంటే ఈశాన్య, తూర్పు దక్షిణాల మధ్య ఖాళీగా వదిలెయ్యాలి.

Also Read:  Aadhaar Update: ఆధార్ అప్డేట్ త్రీ నెలల పాటు ఉచితం తెలుసా!