Site icon HashtagU Telugu

Pooja : పూజ పూర్తి అయిన తర్వాత హారతి ఇవ్వడం వెనుక ఉన్న అంతర్యం ఇదే?

Is This The Meaning Behind Giving Harati After The Pooja Is Done..

Is This The Meaning Behind Giving Harati After The Pooja Is Done..

మామూలుగా హిందువులు ఇంట్లో నిత్య దీపారాధన చేస్తూ ఉంటారు. ఇక దీపారాధన తో పాటు పూజ (Pooja) పూర్తి అయిన తర్వాత కర్పూరాన్ని వెలిగించడం అన్నది కూడా తప్పనిసరి. ప్రతిరోజు కర్పూరం వెలిగించకపోతే ఆ పూజ సంపూర్ణం కాదు అని చాలామంది భావిస్తూ ఉంటారు. అందుకే తప్పకుండా పూజ (Pooja) పూర్తి అయిన తర్వాత కర్పూరంతో దేవుడికి హారతి ఇవ్వాలని చెబుతూ ఉంటారు. పూజ (Pooja) పూర్తయిన తర్వాత ఇలా దేవుడికి హారతి ఎందుకు ఇవ్వాలి? దాని వెనుక ఉన్న కారణమేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. హారతి ఇచ్చినప్పుడు కొంచెయు కళ్లకు అద్దుకుంటూ ఉంటారు. అలా చేస్తే మనసు ప్రశాంతంగా అనిపిస్తుంది. ఎప్పుడైనా హారతి ఇచ్చేటప్పుడు గమనిస్తే గంటను మోగిస్తూ ఉంటారు.

We’re now on WhatsApp. Click to Join.

ఆ సమయంలో భక్తులు రెండు చేతులతో హారతిని కళ్లకు అద్దుకుని సవినయంగా నమస్కరిస్తారు. కొన్ని ప్రదేశాల్లో శంఖాన్ని ఊదుతారు. గంటలు, శంఖం శబ్దం వల్ల మనస్సులో ఎలాంటి ఆలోచనలు లేకుండా పూర్తిగా భగవంతుడిపై మనస్సును లగ్నం చేస్తుంది. ఫలితంగా శరీరంలో నిద్రిస్తున్న ఆత్మ మేల్కొంటుంది. శరీరంలో నూతన ఉత్తేజం వస్తుంది.

ఒకప్పుడు ఆలయాలలో ఎలాంటి కృత్రిమమైన దీపాలూ ఉండేవి కావు. పైగా గాలి కూడా చొరబడని రాతితో ఆ నిర్మాణాలు సాగేవి. అలాంటి ప్రదేశాలలో తేమ అధికంగా ఉండటం సహజం. దీంతో దుర్వాసన, సూక్ష్మక్రిములు దరిచేరక తప్పదు. కర్పూరానికి సూక్ష్మక్రిములను సంహరించే శక్తి, అంటువ్యాధులను నివారించే గుణం ఉన్నాయని ప్రాచీన వైద్యుల నమ్మకం. ఇప్పుడంటే కర్పూరపు తయారీలో రసాయనాలను ఉపయోగిస్తున్నారు.

ఒకప్పుడు కర్పూరం చెట్ల నుంచే సేకరించేవారు. ఆ రకంగా ఫలపుష్ప అర్చనకూ, ధూపదీపాలకూ పూర్తిగా వృక్షాల మీదే ఆధారపడేవారు. పూజ అంతా ప్రకృతి సిద్ధంగానే సాగేది. భగవంతుడికి ఇచ్చిన హారతిని కళ్లకు అద్దుకోవడం సహజం. ఈ ప్రక్రియతో కళ్లకి చలువ చేసే మాట అటుంచి, భగవంతుని మూలవిరాట్టుని నేరుగా తాకలేము కాబట్టి, ఈ హారతి ద్వారా ఆయనను స్పర్శించుకుంటున్నామన్న తృప్తి కలుగుతుంది. హారతితో పాటుగా ఘంటానాదాన్ని చేయడం సహజం. కళ్లు మూసుకుని హారతిని అద్దుకోవడం ద్వారా మనసు, చెవులు, ఆఘ్రానించే శక్తీ, స్పర్శా ఇన్ని ఇంద్రియాలు భగవంతుని ధ్యానంలో లగ్నమవుతాయి. ఇకపోతే హారతి వెనుకున్న శాస్త్రీయ కారణం ఏంటంటే.. పళ్లెంలో పత్తి, నెయ్యి, కర్పూరం, పువ్వులు, గంధం లాంటి సామాగ్రిని ఉంచుతారు. వీటిని ఉపయోగించే హారతినిస్తారు. పత్తి స్వచ్ఛతకు ప్రతిరూపం. ఇందులో కల్తీ ఉండదు. కర్పూరానికి నిప్పును వెలిగించడం ద్వారా అద్భుతమైన సుగంద పరిమళాలతో కూడిన సువాసన వస్తుంది.

ఈ సువాసన నలుమూలలా వెదజల్లి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని సృష్టిస్తుంది. ఫలితంగా ఈ ప్రదేశమంతా సానుకూల వాతావరణం ఏర్పడి సానుకూల శక్తి ప్రసరిస్తుంది. అంతేకాకుండా ప్రతికూల శక్తులు దూరమై అక్కడ ఉన్నవారికి మానసిక ప్రశాంతత చేకూరుతుంది. అందుకే హారతి ప్రశాంతతకు చిహ్నంగా పరిగణిస్తారు.

Also Read:  Kinetic E Luna : త్వరలో మార్కెట్ లోకి రానున్న కైనెటిక్​ ఈ-లూనా.. ధర, ఫీచర్స్ ఇవే?