Fight In Court : డబ్ల్యూఎఫ్ఐ (రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా) చీఫ్, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ పై పోరాటానికి సంబంధించి రెజ్లర్లు కీలక ప్రకటన చేశారు. ఇక తాము వీధుల్లో పోరాడబోమని.. కోర్టులోనే తేల్చుకుంటామని స్పష్టం చేశారు. మహిళా రెజ్లర్లను లైంగికంగా వేధించారనే ఆరోపణలను ఎదుర్కొంటున్న బ్రిజ్ భూషణ్ పై చార్జిషీట్ దాఖలు చేస్తామని ఇచ్చిన హామీని కేంద్ర ప్రభుత్వం నెరవేర్చిందని వినేశ్ ఫోగట్, సాక్షి మాలిక్, బజరంగ్ పునియా ట్విట్టర్ వేదికగా ప్రకటించారు.
https://twitter.com/SakshiMalik/status/1673003268190904325
“మాకు న్యాయం జరిగే వరకు నిరసన కొనసాగుతుంది.. అయితే అది (పోరాటం) ఇకపై ఆ పోరాటం కోర్టులో(Fight In Court) చేస్తాం.. రోడ్డుపై కాదు” అని వారు ట్వీట్ చేశారు. “రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాలో సంస్కరణకు సంబంధించి.. కేంద్ర సర్కారు వాగ్దానం చేసినట్లుగా ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైంది. జూలై 11న ఎన్నికలు నిర్వహిస్తామని ఇచ్చిన వాగ్దానం నెరవేరే వరకు మేం వేచి చూస్తాం” అని వారు తెలిపారు. ఈ ప్రకటన పోస్ట్ చేసిన కొన్ని నిమిషాల తర్వాత ఫోగట్, మాలిక్.. ఇక తాము సోషల్ మీడియా నుంచి కొంత విరామం తీసుకుంటామని తెలుపుతూ మరో ట్వీట్ చేయడం గమనార్హం. కాగా, రెజ్లర్ల పోరాటం ఫలితంగా రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అడ్మినిస్ట్రేటివ్ బాధ్యతల నుంచి సంస్థ చీఫ్ బ్రిజ్ భూషణ్ ను ఇప్పటికే రిలీవ్ చేశారు.
— Vinesh Phogat (@Phogat_Vinesh) June 25, 2023