Site icon HashtagU Telugu

Delhi Woman Guard Rape : మహిళ సెక్యూరిటీ గార్డ్‌ ఫై అత్యాచారం

Woman guard dies after being rape

Woman guard dies after being rape

ఎన్ని చట్టాలు వచ్చిన..కోర్ట్ లు ఎన్ని కఠిన శిక్షలు విధిస్తున్న కామాంధుల్లో మాత్రం మార్పు రావడం లేదు. చట్టాలకు , పోలీసులకు ,కోర్ట్ లకు ఏమాత్రం భయపడకుండా..ఒంటరిగా మహిళ కనిపిస్తే చాలు మృగంలా వారిమీద పడి వారి కామ కోరికలు తీర్చుకుంటున్నారు. దేశ వ్యాప్తంగా ప్రతి రోజు ఇలాంటి ఘటనలు పదుల సంఖ్యలో వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. తాజాగా దేశ రాజధాని న్యూఢిల్లీ (Delhi)లో ఈ తరహా ఘటన చోటుచేసుకుంది. సెక్యూరిటీ గార్డ్‌ గా పనిచేస్తున్న మహిళ ఫై హౌసింగ్ సొసైటీ సూపర్‌వైజర్‌గా పనిచేస్తున్న వ్యక్తి అత్యాచారం చేసి..తీవ్రంగా గాయపరిచాడు. ఆమె చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచింది.

వివరాల్లోకి వెళ్తే..

జార్ఖండ్‌కు చెందిన సదరు యువతి (19) ఘజియాబాద్‌లోని (Ghaziabad ) ఒక హౌసింగ్ సొసైటీలో (Housing Society) సెక్యూరిటీ గార్డ్‌ (Security Guard)గా పనిచేస్తుంది. హౌసింగ్ సొసైటీ సూపర్‌వైజర్‌గా పనిచేస్తున్న వ్యక్తి..ఆమెపై కన్నేసి, ఆదివారం ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అత్యాచారంతోపాటు దారుణంగా కొట్టడంతో బాధితురాలు తీవ్రంగా గాయపడింది. ఈ విషయాన్ని గుర్తించిన ఆమె సహచరులు హుటాహుటిన హాస్పిటల్‌కు తరలించారు. డాక్టర్స్ చికిత్స అందించినప్పటికీ..ఆమె ఆరోగ్యం మరింత విషమం అయి..సోమవారం ఉదయం ఆమె ప్రాణాలు విడిచింది.

Read Also : Bomb Threat Mail : శంషాబాద్ ఎయిర్ పోర్టు కు బాంబు బెదిరింపు ..అసలు ట్విస్ట్ ఏంటి అంటే..!

కాగా బిల్డింగ్‌లో నివసించే ముగ్గురు వ్యక్తులు అత్యాచారం చేసి బాధితురాలిని అన్యాయంగా పొట్టన పెట్టుకున్నారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. అత్యాచారం తర్వాత విషం తాగడంతో సఫ్దార్‌జంగ్ హాస్పిటల్‌కు తరలించాల్సి వచ్చిందని తెలిపారు. ఇక ఈ ఘటనపై డీసీపీ (రూరల్) వివేక్ చంద్ యాదవ్ మాట్లాడుతూ.. అత్యాచారం సెక్షన్ కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశామని… యువతిపై సామూహిక అత్యాచారం జరగలేదన్నారు. హౌసింగ్ సొసైటీలో ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాలను పరిశీలించామని, గ్యాంగ్ రేప్ జరగలేదని తేల్చి చెప్పారు. బాధితురాలి మృతికి విషమే కారణమా లేక ఉపిరితిత్తుల వ్యాధితో చనిపోయిందా అనే విషయాన్ని నిర్ధారించేందుకు నమూనాలను ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబోరేటరీకి పంపించామని తెలిపారు.