Rajiv Jain: మునిగిపోతున్న అదానీ నౌకను నిలబెట్టిన రాజీవ్ జైన్ ఎవరు?
రాజీవ్ జైన్.. ఇప్పుడు ఈ పేరుపై స్టాక్ మార్కెట్ వర్గాల్లో విస్తృత చర్చ జరుగుతోంది. ఆయన ఎవరు అనేది అందరూ గూగుల్ లో సెర్చ్ చేస్తున్నారు.
- By Maheswara Rao Nadella Published Date - 12:30 PM, Sun - 5 March 23

రాజీవ్ జైన్ (Rajiv Jain) ఇప్పుడు ఈ పేరుపై స్టాక్ మార్కెట్ వర్గాల్లో విస్తృత చర్చ జరుగుతోంది. ఆయన ఎవరు అనేది అందరూ గూగుల్ లో సెర్చ్ చేస్తున్నారు. మునిగిపోతున్న అదానీ నౌకను రిపేర్ చేసి, మళ్లీ స్టెడీగా నిలబెట్టిన రాజీవ్ జైన్ గురించి ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..
రూ. 15,446 కోట్లకు కొన్నారు..
జనవరి 24, 2023న, షార్ట్ సెల్లర్ హిండెన్‌బర్గ్ రీసెర్చ్ రిపోర్ట్ తర్వాత అదానీ గ్రూప్ స్టాక్స్ డౌన్ అయ్యాయి. కొన్ని స్టాక్స్ ధర 85 శాతం వరకు డౌన్ అయింది. ఇన్వెస్టర్లలో తిరిగి నమ్మకం కలిగించేందుకు అదానీ గ్రూప్ చేసిన ప్రయత్నాలు ఫెయిల్ అయ్యాయి. ఇలాంటి టైంలో రాజీవ్ జైన్ (Rajiv Jain) ఎంట్రీ ఇచ్చారు. అదానీ గ్రూప్‌లోని నాలుగు అదానీ గ్రూప్ కంపెనీల షేర్లను ఏకంగా రూ. 15,446 కోట్లకు కొన్నారు. అదానీ గ్రూప్ ప్రమోటర్లు గురువారం ఈ షేర్లను అమెరికాకు చెందిన గ్లోబల్ ఈక్విటీ- ఇన్వెస్ట్‌మెంట్ కంపెనీ అయిన GQG పార్టనర్స్‌కు విక్రయించినట్టు ప్రకటించారు.
దీని తర్వాత అదానీ గ్రూప్ కంపెనీలపై ఇన్వెస్టర్ల విశ్వాసం పెరిగింది.
ఐదేళ్లుగా ఒక కన్నేసి..
జీక్యూజీ పార్టనర్స్ (GQG Partners) అనే కంపెనీ సహ వ్యవస్థాపకుడు, చైర్మన్ రాజీవ్ జైన్. 1994లో పోర్ట్‌ఫోలియో మేనేజర్‌గా తన కెరీర్‌ను రాజీవ్ జైన్ ప్రారంభించారు. కేవలం ఏడు సంవత్సరాల్లో $92 బిలియన్ల సంస్థగా GQGని తీర్చిదిద్దారు. అదానీ గ్రూప్‌నకు అద్భుతమైన ఆస్తులు ఉన్నాయని, అవి చాలా ఆకర్షణీయమైన విలువలతో లభిస్తుండటం వల్లే దాని షేర్లను కొన్నామని చెప్పారు. గత ఐదేళ్లుగా అదానీ గ్రూప్ స్టాక్స్‌పై ఒక కన్నేసి ఉంచామని తెలిపారు. అయితే గ్రూప్ షేర్ల వాల్యుయేషన్ ఎక్కువగా ఉందని అప్పుడేమీ కొనలేదన్నారు. భారతదేశ విమాన ట్రాఫిక్‌లో 25 శాతం అదానీ విమానాశ్రయానిదేనని, దేశవ్యాప్త కార్గో పరిమాణంలో 25 నుంచి 40 శాతం అదానీ ఓడరేవులదేనని రాజీవ్ జైన్ వివరించారు. తన ప్రస్తుత పెట్టుబడి సరైందేనని భవిష్యత్ లో రుజువవుతుందని రాజీవ్ జైన్ ఆశాభావం వ్యక్తం చేశారు.
అదానీ గ్రూప్ స్టాక్స్ కు బలం
అదానీ గ్రూప్‌లో రాజీవ్ జైన్ కొనుగోళ్ల తర్వాత అదానీ స్టాక్స్ దూసుకుపోయాయి, గరిష్టంగా లాభపడ్డాయి. అదానీ గ్రూప్ మార్కెట్ క్యాప్ ఒక్క రోజులో దాదాపు రూ. 70,000 కోట్లు పెరిగింది.
రాజీవ్ జైన్ (Rajiv Jain) ఎవరు?
రాజీవ్ జైన్ భారతదేశంలో పుట్టి పెరిగాడు. 1990లో యూనివర్శిటీ ఆఫ్ మియామిలో MBA చదివేందుకు USకు వెళ్లారు. పోర్ట్‌ఫోలియో మేనేజర్‌గా అతని కెరీర్ 1994లో వొంటోబెల్ అసెట్ మేనేజ్‌మెంట్‌లో చేరినప్పుడు ప్రారంభమైంది. క్రమంగా, అతను వొంటోబెల్‌లో “స్టార్ మేనేజర్”గా పేరు పొందాడు. అతను CIO స్థాయికి మరియు వొంటోబెల్‌లో ఈక్విటీల అధిపతిగా ఎదిగాడు.
తరువాత, 2014 మరియు 2016 మధ్య, అతను కంపెనీ కో-CEOగా పనిచేశాడు. బ్లూమ్‌బెర్గ్ ప్రకారం, అతను వొంటోబెల్‌ను విడిచిపెట్టే సమయానికి, దాని ఎమర్జింగ్ మార్కెట్ ఫండ్ 10 సంవత్సరాలలో 70 శాతం తిరిగి ఇచ్చింది.
2016లో, జైన్ GQG పార్ట్‌నర్స్‌ను స్థాపించారు. దాని ఛైర్మన్ మరియు CIO పాత్రను చేపట్టారు.
Also Read: Self-Cleaning Touch Screen: సెల్ఫ్ క్లీనింగ్ టచ్ స్క్రీన్ వస్తున్నాయి.. జనరల్ మోటార్స్ కి పేటెంట్
