Diwali US Holiday : అమెరికాలో అఫీషియల్ హాలిడేగా దీపావళి!

అమెరికాలో ప్రభుత్వ సెలవు దినాలను ఫెడరల్‌ హాలీడేస్ (Diwali US Holiday) అంటారు. 

  • Written By:
  • Publish Date - May 27, 2023 / 12:03 PM IST

చాలామంది అమెరికా అధ్యక్షులు దీపావళి పండుగ వేడుకల్లో పాల్గొన్న సందర్భాలను మనం చూశాం. ఇదే అమెరికాలో అధికారికంగా దీపావళి పండుగను జరుపుకునే రోజులు కూడా  ఎంతో దూరంలో లేవు. ఇప్పటికే ఆ దిశగా ప్రయత్నాలు  ప్రారంభం అయ్యాయి. అమెరికాలో ప్రభుత్వ సెలవు దినాలను ఫెడరల్‌ హాలీడేస్ (Diwali US Holiday) అంటారు.  దీపావళిని ఫెడరల్‌ హాలీడేగా(Diwali US Holiday) ప్రకటించాలని కోరుతూ అమెరికా చట్ట సభ్యురాలు గ్రేస్‌ మెంగ్‌ శుక్రవారం ప్రతినిధుల సభలో ప్రత్యేక బిల్లును ప్రవేశపెట్టారు. దీనిపై  అమెరికాలోని భారతీయ కమ్యూనిటీ హర్షం వ్యక్తం చేస్తోంది.

Also read : Diwali : దీపావళి అమావాస్య ముహూర్తం, ఆరాధన విధానం, ప్రాముఖ్యత, పరిహారాలు ఇవే..!!

ఫెడరల్‌ హాలీడే బిల్లును తొలుత పార్లమెంటు ఆమోదించాలి. ఆ తరువాత అమెరికా అధ్యక్షుడి సంతకంతో అది చట్టంగా మారుతుంది. ఒకవేళ ఇదంతా జరిగితే దీపావళి పండుగ.. ఫెడరల్‌ హాలీడే అవుతుంది.  అమెరికాలో ప్రస్తుతం 11 ఫెడరల్‌ హాలీడేస్‌ ఉన్నాయి. వీటిలో న్యూ ఇయర్‌, మార్టిన్‌ లూథర్‌ కింగ్‌ జయంతోత్సవాలు, వాషింగ్టన్‌ బర్త్‌డే, మెమొరియల్‌ డే, జూన్‌టీన్త్‌ నేషనల్ ఇండిపెండెన్స్‌ డే, ఇండిపెండెన్స్‌ డే, లేబర్‌ డే, కొలంబస్‌ డే, వెటరన్స్‌ డే, థాంక్స్‌ గివింగ్‌ డే, క్రిస్మస్‌ డే ఉన్నాయి. దీపావళిని కూడా కలుపుకునేట్  ఫెడరల్‌ హాలీడేస్ సంఖ్య 12కు పెరుగుతుంది.