PM KISAN – 3000 Hike : రైతులకు గుడ్ న్యూస్.. “పీఎం-కిసాన్‌” సాయం రూ.3000 పెంపు ?

PM KISAN - 3000 Hike : రైతులకు గుడ్ న్యూస్!! ‘పీఎం-కిసాన్‌’  పథకం కింద రైతులకు పెట్టుబడి సాయంగా  అందించే ఆర్థిక సాయాన్ని మరో రూ.3000 పెంచాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది.

  • Written By:
  • Updated On - August 22, 2023 / 11:40 AM IST

PM KISAN – 3000 Hike : రైతులకు గుడ్ న్యూస్!! ‘పీఎం-కిసాన్‌’  పథకం కింద రైతులకు పెట్టుబడి సాయంగా  అందించే ఆర్థిక సాయాన్ని మరో రూ.3000 పెంచాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. ‘పీఎం-కిసాన్‌’  పథకం కింద ప్రస్తుతం ఏడాదికి రూ.6 వేలు చొప్పున కేంద్ర సర్కారు అన్నదాతలకు అందిస్తోంది.ఈ 6వేల రూపాయలను రూ.2 వేలు చొప్పున ఏడాదిలో మూడు విడతల్లో రైతుల అకౌంట్స్ లో జమ చేస్తున్నారు.

Also read : Rajinikanth : సీఎం యోగీ కాళ్లు మొక్కడం ఫై క్లారిటీ ఇచ్చిన రజనీకాంత్

ఇది మరో రూ.3000 పెరిగితే ‘పీఎం-కిసాన్‌’  ద్వారా అందే పెట్టుబడి సాయం  మొత్తం రూ.9వేలకు (PM KISAN – 3000 Hike) చేరుతుంది.  ‘పీఎం-కిసాన్‌’  సాయం పెంపునకు సంబంధించిన ప్రపోజల్   ప్రస్తుతం ప్రధానమంత్రి కార్యాలయం పరిశీలనలో ఉందని  “ఫైనాన్షియల్ ఎక్స్ ప్రెస్” లో కథనం వచ్చింది. ‘పీఎం-కిసాన్‌’ పథకం 2018 ఫిబ్రవరి 1న ప్రారంభమైంది.