Site icon HashtagU Telugu

India Name Change : ఇండియా పేరు మార్పుపై ఐరాస ఏమంటుందంటే..

India Name Change

India Name Change

కేంద్రం (Central government) మరో కీలక నిర్ణయం తీసుకోబోతుంది. ఇప్పటివరకు మనదేశాన్ని ఇండియా (India) గా పిలుస్తూవచ్చాం..కానీ ఇప్పుడు కేంద్ర సర్కార్ ఇండియా ను కాస్త భారత్ (Bharat) గా మార్చేందుకు డిసైడ్ అయ్యింది. ఇప్పటికే దీనికి సంబదించిన ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తుంది. ఈ క్రమంలో ఇండియా పేరు మార్పు ఫై ఐరాస స్పందించింది.

‘ఇండియా (India)’ పేరు ఇంగ్లిష్‌లోనూ‘భారత్‌ (Bharat)’గా మారనుందా? అన్న మీడియా ప్రతినిధుల ప్రశ్నకు ఐరాస (United Nations) సెక్రటరీ జనరల్‌ ఆంటోనియో గుటెరస్‌ డిప్యూటీ అధికార ప్రతినిధి ఫర్హాన్‌ హక్‌ స్పందించారు. గతేడాది టర్కీ తన పేరును ‘తుర్కియే’గా మార్చుకున్న అంశాన్ని ఉదహరణగా పేర్కొన్నారు. ‘తుర్కియే విషయంలో ఆ దేశ ప్రభుత్వం పంపిన అధికారిక అభ్యర్థనను స్వీకరించి సానుకూలంగా స్పందించాం.. అలాగే, ఏ దేశమైనా ఇలాంటి అభ్యర్థనలు పంపిస్తే వాటిని మేం పరిగణనలోకి తీసుకుంటాం’ అని హక్‌ తెలిపారు.

ఈ నెల 18 నుంచి 22 వరకూ ఐదు రోజుల పాటు జరిగే పార్లమెంట్ ప్రత్యేక భేటీలో ఇండియా పేరును కాస్తా భారత్ గా మార్చేందుకు కేంద్రం ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే అంతకు ముందు నుండే ఇండియా ప్లేస్ లో భారత్ ను ప్రచారం చేయడం మొదలుపెట్టింది కేంద్రం. రేపటి నుండి ఢిల్లీ వేదికగా జీ20(G20 summit) దేశాల సదస్సు జరగబోతోంది. ఈ సదస్సుకు దేశ, విదేశీ అతిధుల్ని ఆహ్వానించారు. వీరికి పంపిన ఆహ్వన పత్రికల్లో ప్రెసిడెంట్ ఆఫ్ భారత్ (President of Bharat) పేరుతో ఆహ్వానాలు పంపారు. వాస్తవానికి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా (President of India)గా వెళ్లాల్సిన ఈ ఆహ్వానాలు కాస్తా ప్రెసిడెంట్ ఆఫ్ భారత్ పేరుతో వెళ్లడంతో అతిధులు కూడా కాస్త ఆశ్చర్యానికి లోనయ్యారు.

Read Also : India means Bharat : ఇండియా అంటే భారత్… భారత్ అంటే ఇండియా…

ఇండియా పేరు మార్పు ఫై విపక్షాలు మండిపడుతున్నాయి. విపక్ష కూటమికి ‘ఇండియా’ అనే పేరు పెట్టుకోవడంతోనే బీజేపీకి భయం పట్టుకుందని, అందుకే ఇలాంటి చర్యలకు పాల్పడుతోందని ధ్వజమెత్తాయి. అయితే, బీజేపీ సైతం వీటిని ధీటుగా తిప్పికొడుతోంది. రాజ్యాంగం ప్రకారం దేశం పేరు ‘భారత్‌’ అని ఉందని, అలా రాయడంలో తప్పులేదని సమర్దించుకుంటోంది.