800 Crore For Stone Pelting : అప్పుల ఊబిలో ఉన్న పాకిస్థాన్.. కశ్మీర్ లో రాళ్ల దాడి చేయడానికి మాత్రం వందల కోట్లు ఇచ్చింది.
2009 నుంచి 2020 సంవత్సరం మధ్యకాలంలో కశ్మీర్ లో భారత ఆర్మీ పై రాళ్లదాడులు చేయించేందుకు రూ.800 కోట్లకుపైనే సమకూర్చింది.
2020 సంవత్సరం తర్వాత కశ్మీర్ లోయలో పాకిస్తాన్ ప్రేరేపిత రాళ్ల దాడి ఘటనలు ఆగిపోయాయి. 2022 సంవత్సరంలో కశ్మీర్ లో కేవలం 5 రాళ్ల దాడి ఘటనలు జరిగాయి. ఇక ఈ ఏడాది(2023లో) ఇప్పటివరకు కశ్మీర్‌లో ఒక్క రాళ్ల దాడి ఘటన కూడా జరగలేదు. 2020కి ముందు కశ్మీర్ లో నెలకొన్న పరిస్థితిపై ఒక లుక్ వేస్తే .. ప్రతి ఏడాది పదుల సంఖ్యలో రాళ్లదాడి ఘటనలు జరిగాయి. పాకిస్తాన్ నుంచి అందిన నిధులతో.. 2016లో శ్రీనగర్‌లో పథర్‌బాజ్ అసోసియేషన్ ఆఫ్ జమ్మూ కాశ్మీర్ వంటి సంస్థలు ఏర్పడ్డాయి. ఇండియన్ ఇంటెలిజెన్స్ బ్యూరో (IB) నివేదిక ప్రకారం.. 2009 నుంచి 2020 సంవత్సరాల మధ్య కాలంలో రాళ్లదాడులు చేయించే సంస్థలకు పాకిస్థాన్ నుంచి రూ.800 కోట్లకు పైగా నిధులు(800 Crore For Stone Pelting) అందాయి. అంటే ప్రతి ఏడాది సగటున 80 కోట్ల రూపాయలు పాక్ నుంచి ఆ కాశ్మీరీ సంస్థలకు అందాయి.
800 కోట్ల డిస్ట్రిబ్యూషన్ ఇలా జరిగింది..
“కశ్మీర్ లోయలో రాళ్లు రువ్వడం అనేది 2009 నుంచి 2020 మధ్య కాలంలో ఒక పరిశ్రమగా మారింది. ఉగ్రవాదులు, హ్యాండ్లర్లు, హవాలా నెట్‌వర్క్ వంటి మార్గాల ద్వారా పాకిస్తాన్ నుంచి రాళ్లదాడుల కోసం కాశ్మీరీ సంస్థలకు ఫండింగ్ వచ్చింది. ఆ డబ్బులు కాశ్మీర్ లోని వివిధ నగరాల్లో ఉన్న వేర్పాటువాద నాయకులు, ఓవర్‌గ్రౌండ్ కార్మికుల నెట్‌వర్క్ ద్వారా రాళ్లు రువ్వే యువకులకు పంపిణీ చేశారు” అని ఇండియన్ ఇంటెలిజెన్స్ బ్యూరో (IB) పేర్కొంది. రాళ్ల దాడులను ప్రోత్సహించే సంస్థలకు ఫండింగ్ దొరకకుండా చేయడం వల్లే కాశ్మీర్ లో రాళ్లదాడులు ఆగాయని తెలిపింది. రాళ్లు రువ్విన వారిని ఆగ్రా, తీహార్ తదితర రాష్ట్రాల్లోని జైళ్లకు పంపామని పేర్కొంది.
Also read : 4 Terrorists Killed: నలుగురు ఉగ్రవాదులు హతం.. వారం వ్యవధిలో 9 మంది టెర్రరిస్టులు హతం
రాళ్లదాడి వల్లే కాశ్మీర్ సమస్య పరిష్కారం అవుతుందని చెప్పేవారు
“16 ఏళ్ల వయసులో తొలిసారిగా నేను రాళ్లదాడి చేశాను. రాళ్లదాడి వల్లే కాశ్మీర్ సమస్య పరిష్కారం అవుతుందని మాకు కొందరు చెప్పేవారు. పోలీసులు, కోర్టు చుట్టూ తిరిగాక నాకు వాస్తవాలు అర్థమయ్యాయి. రాళ్లదాడి ఘటనలతో నాకే నష్టం కలిగింది. ఇప్పుడు నేను దానిని వదిలేశాను” అని ఆదిల్ ఫరూఖ్ అనే కాశ్మీరీ యువకుడు చెప్పాడు.
రాళ్లు రువ్వేటందుకు వెయ్యి రూపాయలు ఇచ్చేవారు
“రాళ్లు రువ్వడానికి ఒక ఏజెంట్ నాకు వెయ్యి రూపాయలు ఇచ్చేవాడు. రాళ్లదాడి చేయాలని నన్ను రెచ్చగొట్టేవాడు. ఎక్కడ రాళ్లు వేయాలో ముందే చెప్పేవాడు. నేను అతడు చెప్పినట్టుగా చేసేవాణ్ణి. కానీ ఆ తరువాత నేను చింతించాల్సి వచ్చింది” అని కాశ్మీరీ యువకుడు అబ్రార్ బట్ చెప్పాడు.