Rs 88032 Crores Missing : కోటి కాదు.. 1000 కోట్లు కాదు..
రూ.88,032 కోట్ల విలువైన రూ. 500 నోట్లు మాయమయ్యాయి..
ఆర్థిక వ్యవస్థ నుంచి మిస్ అయిన రూ. 500 నోట్ల సంఖ్య దాదాపు 176 కోట్లు ఉంటుంది.
సమాచార హక్కు చట్టం (RTI) దరఖాస్తుతో ఈ సంచలన విషయాలు వెలుగు చూశాయి.
సమాచార హక్కు కార్యకర్త మనోరంజన్ రాయ్ RTI దరఖాస్తు చేయడంతో వాస్తవం వెలుగులోకి వచ్చింది. బెంగళూరులోని భారతీయ రిజర్వ్ బ్యాంక్ నోట్ ముద్రణ్ (పీ) లిమిటెడ్, నాసిక్ లోని కరెన్సీ నోట్ ప్రెస్, మధ్యప్రదేశ్ లో ఉన్న దేవాస్ లోని బ్యాంక్ నోట్ ప్రెస్ ల్లో రూ. 500 నోట్లను ముద్రిస్తారు. వీటిలో మొత్తం 8,810.65 మిలియన్ల రూ. 500 నోట్లను ముద్రిస్తే.. ఆర్బీఐ కి చేరినవి 7,260 మిలియన్ల నోట్లు మాత్రమేనని వెల్లడైంది. అంటే.. సుమారు 1,760.65 మిలియన్ల రూ. 500 నోట్లు మాయం అయ్యాయి. ఆ మిస్ అయిన నోట్ల విలువ సుమారు రూ. రూ. 88,032.5 కోట్లు (Rs 88032 Crores Missing). అవి ఎక్కడికి వెళ్లాయన్నది తెలియాల్సి ఉంది.
Also read : Rs 500 Fake Notes: అలర్ట్.. రూ. 500 నోట్లలో పెరుగుతున్న నకిలీ నోట్లు
CEIB, EDకి ఫిర్యాదు
నాసిక్ ప్రెస్ 2016 -2017 మధ్య 1,662 మిలియన్ల రూ. 500 నోట్లను సప్లై చేసింది. బెంగళూరులోని మింట్ 5,195.65 మిలియన్ల నోట్లను, దేవాస్ లోని మింట్ 1,953 మిలియన్ల నోట్లను ఆర్బీఐకి సప్లై చేశాయి.ఈ మూడు మింట్స్ నుంచి మొత్తం 8,810.65 మిలియన్ల రూ. 500 నోట్లు ఆర్బీఐకి సప్లై అయ్యాయి. కానీ ఆర్బీఐ కి చేరినవి 7260 మిలియన్ల నోట్లు మాత్రమే. ఈ కరెన్సీ నోట్ల మాయం వ్యవహారంపై సమాచార హక్కు కార్యకర్త మనోరంజన్ రాయ్ సెంట్రల్ ఎకనమిక్ ఇంటలిజెన్స్ బ్యూరో (CEIB) కు, ఈడీ (ED) కి ఫిర్యాదు చేశారు. ఆ నోట్లు ఎక్కడికి చేరాయో దర్యాప్తు చేయాలని కోరారు. ఈ కథనంపై ఆర్బీఐ అధికారులు స్పష్టమైన సమాధానం ఇవ్వలేదు. 2022- 23 లో రూ. 500 డినామినేషన్ లో మొత్తం 91,110 నకిలీ నోట్లను గుర్తించామని ఇటీవల ఆర్బీఐ విడుదల చేసిన ఒక నివేదిక వెల్లడించింది. అంతకుముందు సంవత్సరం కన్నా ఇది 14.4% ఎక్కువని తెలిపింది. అదే సమయంలో రూ. 2 వేల డినామినేషన్ లో మొత్తం 9,806 నకిలీ నోట్లను గుర్తించామని తెలిపింది.