Site icon HashtagU Telugu

ISRO : చంద్రుడిపై ఉష్ణోగ్రత ఎంతో ఉందో తెలిపిన ఇస్రో

Chandrayaan-3

ISRO Gets Temperature Profile Of Moon's South Pole From Vikram For The First Time

జాబిలి ఫై విక్రమ్ ల్యాండర్ ను పంపిన ISRO ..అక్కడి పరిస్థితులను ఎప్పటికప్పుడు తెలియజేస్తూ వస్తుంది. తాజాగా చంద్రుడిపై ఉష్ణోగ్రత వివరాలను తెలిపింది. చంద్రుడి ఉపరితలంపై సుమారు 50 డిగ్రీల ఉష్ణోగ్రత ఉన్నట్టుగా ఇస్రో పేర్కొంది. అయితే చంద్రుడి 80 మిల్లీ మీటర్ల లోతులో ఉష్ణోగ్రత మైనస్ 10 డిగ్రీలుగా నమోదైనట్టుగా పేలోడ్ (Chandra’s Surface Thermophysical Experiment) పంపిన గణాంకాలు చెబుతున్నాయని ఇస్రో తెలిపింది.

చంద్రుని దక్షిణ ధ్రువం వెంబడి ఉపరితలంలోని నేల ఉష్ణోగ్రతల తీరును ChaSTE కొలిచిందని ఇస్రో వివరించింది. దీని ఆధారంగా చంద్రుని ఉపరితలంపై ఉష్ణోగ్రతలు మారే తీరును అర్థం చేసుకోవచ్చునని తెలిపింది. అంటే వేడి తగిలినపుడు ఏదైనా వస్తువు ఏ విధంగా స్పందిస్తుందో తెలుసుకోవచ్చు. పరిసరాల నుంచి వచ్చే వేడిని ఏదైనా వస్తువు స్వీకరించినపుడు దాని ఉష్ణోగ్రత పెరుగుతోందా? లేదా? వంటి విషయాలను తెలుసుకోవచ్చు.

Read Also : Khammam BJP Meeting : కాంగ్రెస్ 4జీ ..బీఆర్ఎస్ 2జీ ..మజ్లిస్ 3జీ పార్టీలంటూ అమిత్ షా సెటైర్లు

విక్రమ్ ల్యాండర్ లో నాలుగు, ప్రగ్యాన్ రోవర్ ( Pragyan Rover) లో రెండు, ప్రొపల్షన్ మాడ్యూల్ లో ఒక పేలోడ్ ఉంది. విభిన్న శాస్త్రీయ ప్రయోగాలు చేసేందుకు ఈ పేలోడ్ లు ఏర్పాటు చేశారు. మరో వైపు చంద్రుడిపై మట్టిని అధ్యయనం చేసేందుకు అవసరమైన పరికరాలను కూడా ఇస్రో పంపింది. 2019లో చంద్రయాన్-2 విఫలమైంది. దీంతో చంద్రయాన్-3 ప్రయోగం చేసింది. చంద్రుడి దక్షిణ ధృవంపై సేఫ్ ల్యాండింగ్ పై ఇస్రో శాస్త్రవేత్తలు కేంద్రీకరించారు. ఈ ఏడాది జూలై 14న చంద్రయాన్-3 ను ప్రయోగిచింది. ఈ నెల 23న చంద్రుడి దక్షిణ ధృవంపై విక్రమ్ ల్యాండర్ విజయవంతంగా ల్యాండ్ అయింది.