Site icon HashtagU Telugu

Rs 2000 Note: రూ. 2000 నోట్ల చలామణిపై ఆర్బీఐ కీలక ప్రకటన..!

Rs 2000 Notes

Rs.2000 Notes

Rs 2000 Note: రూ.2000 నోటు (Rs 2000 Note)ను ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించిన తర్వాత చాలా వరకు బ్యాంకుల్లో జమ అయింది. ఇప్పటి వరకు చెలామణిలో ఉన్న రూ. 2000 నోట్లలో 97 శాతానికి పైగా తిరిగి వచ్చినట్లు రిజర్వ్ బ్యాంక్ తాజాగా తెలిపింది. మే 19, 2023న చెలామణిలో ఉన్న రూ. 2000 నోట్లలో 97.26 శాతం నోట్లు బ్యాంకింగ్ వ్యవస్థకు తిరిగి వచ్చినట్లు డిసెంబర్ 1, శుక్రవారం సెంట్రల్ బ్యాంక్ తెలిపింది. దీనితో పాటు రూ. 2000 నోట్లు చట్టబద్ధంగా ఉన్నాయని, భవిష్యత్తులో కూడా చట్టబద్ధంగా ఉంటాయని ఆర్బీఐ తెలిపింది.

2023 మే 19న 2000 రూపాయల నోట్లను ఉపసంహరించుకుంటున్నట్లు రిజర్వ్ బ్యాంక్ ప్రకటించింది. సెంట్రల్ బ్యాంక్ ఈ నిర్ణయం పెద్ద నోట్ల రద్దుతో ముడిపడి ఉంది. దీనిని మినీ డీమోనిటైజేషన్ అని కూడా పిలుస్తారు. మే 19, 2023 నాటికి చెలామణిలో ఉన్న రూ.2000 నోట్ల విలువ రూ.3.56 లక్షల కోట్లు. నవంబర్ 30, 2023 ముగిసిన తర్వాత చెలామణిలో మిగిలి ఉన్న రూ.2000 నోట్ల విలువ రూ.9,760 కోట్లు మాత్రమే.

Also Read: Gaza Truce Expired : మళ్లీ యుద్ధమేనా.. ఇజ్రాయెల్ – హమాస్ ‘కాల్పుల విరమణ’ డీల్ క్లోజ్

నవంబర్ 2016లో నోట్ల రద్దు తర్వాత రిజర్వ్ బ్యాంక్ రూ.2000 నోటును ప్రవేశపెట్టింది. మే 19, 2023న ఉపసంహరణ ప్రకటనకు చాలా కాలం ముందు రిజర్వ్ బ్యాంక్ దీని గురించి నిర్ణయం తీసుకుంది. 2019లోనే 2000 రూపాయల నోట్ల ముద్రణను రిజర్వ్ బ్యాంక్ నిలిపివేసింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డేటా ప్రకారం.. మార్చి 31, 2018 నాటికి చెలామణిలో ఉన్న రూ. 2000 నోట్ల మొత్తం విలువ రూ. 6.73 లక్షల కోట్లు. ఇది రూ. 2000 నోట్ల చలామణిలో అత్యధిక స్థాయి.

We’re now on WhatsApp. Click to Join.

2000 రూపాయల నోట్ల చెలామణిని నియంత్రించేందుకు రిజర్వ్ బ్యాంక్ ప్రయత్నాలు ప్రారంభించింది. ఈ కారణంగా 2019 తర్వాత రిజర్వ్ బ్యాంక్ కొత్త 2000 రూపాయల నోట్ల ముద్రణను నిలిపివేసింది. చివరకు ఈ ఏడాది మేలో రిజర్వ్ బ్యాంక్ వాటిని ఉపసంహరించుకోవాలని ప్రకటించింది. ఆ సమయంలో రిజర్వ్ బ్యాంక్ ప్రజలకు రూ.2000 నోట్లను మార్చుకోవడానికి లేదా వారి బ్యాంకు ఖాతాల్లో డిపాజిట్ చేయడానికి సెప్టెంబర్ 30 వరకు సమయం ఇచ్చింది. తరువాత దానిని అక్టోబర్ 7వరకు పొడిగించింది.