Arey Baith Neeche : కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ నేతృత్వంలోని “ఇండియా” కూటమి ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై లోక్ సభలో ఇప్పుడు వాడివేడి చర్చ జరుగుతోంది.
ఈక్రమంలో సభలో కేంద్రమంత్రి నారాయణ రాణె చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి..
ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై శివసేన(ఉద్ధవ్ థాక్రే) ఎంపీ అరవింద్ సావంత్ చేసిన కామెంట్స్ కు నారాయణ రాణె కౌంటర్ ఇస్తూ సహనం కోల్పోయారు.
Also read : Salary 45K-Assets 10 Crore : శాలరీ 45వేలు.. ఆస్తి 10 కోట్లు.. దొరికిపోయిన అవినీతి చేప
“సావంత్.. మీరు కూర్చోండి(Arey Baith Neeche). ప్రధాన మంత్రి మోడీ, కేంద్రమంత్రి అమిత్ షాపై వ్యాఖ్యలు చేసే స్థాయి మీకు లేదు. ఒకవేళ మీరు మాట్లాడితే.. దాని పరిణామాలు ఎదుర్కొంటారు” అని నారాయణ రాణె వార్నింగ్ ఇచ్చారు. దీంతో లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా జోక్యం చేసుకొని.. కేంద్రమంత్రి నారాయణ రాణెను మందలించారు. “సరైన పదజాలం వాడండి” అని ఆయనకు హితవు పలికారు. ఇక రాణె ప్రవర్తనపై విపక్షాలు మండిపడ్డాయి. “నారాయణ రాణె రౌడీలా పార్లమెంట్‌లో బెదిరింపులకు దిగారు. మోడీ ప్రభుత్వాన్ని ప్రశ్నించే విపక్ష సభ్యులను వెంటనే సభ నుంచి సస్పెండ్ చేస్తున్నారు. కానీ ఇలా అనుచిత భాష ఉపయోగించిన కేంద్ర మంత్రిని సస్పెండ్ చేయరా ? ఇదేం న్యాయం ?” అని ఆమ్‌ఆద్మీపార్టీ ప్రశ్నించింది. మంత్రి తన మాటలతో ఈ ప్రభుత్వ ప్రమాణాలను చూపిస్తున్నారని శివసేన ఎంపీ ప్రియాంకా చతుర్వేది ఆగ్రహం వ్యక్తం చేశారు.