Site icon HashtagU Telugu

Padma Awards: మోదీ నా అభిప్రాయం తప్పని నిరూపించారు

Padma Awards (1)

Padma Awards (1)

Padma Awards: ప్రతిష్టాత్మక పద్మ పురస్కారాల ప్రధానోత్సవం రాష్ట్రపతి భవన్ లో ఘనంగా జరిగింది. సుధామూర్తి, చినజీయర్ స్వామి, కీరవాణి వంటి పలువురు ప్రముఖులు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా పురస్కారాలను అందుకున్నారు. ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా, ఇంకా పలువురు రాజకీయ ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. అయితే పురస్కారాలను అందుకున్న వారిని మోదీ స్వయంగా అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ప్రముఖ బిద్రి క్రాఫ్ట్ ఆర్టిస్ట్ రషీద్ అహ్మద్ ఖాద్రి మోదీతో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బీజేపీ ప్రభుత్వం ముస్లింలకు అవార్డులు ఇవ్వదంటూ తాను అనుకున్నానని, అయితే మీరు నా అభిప్రాయాన్ని తప్పని నిరూపించారంటూ ప్రధానితో ఆయన వ్యాఖ్యానించారు. దీంతో ప్రధాని మోదీ నవ్వేశారు.

యూపీఎ హయాంలో అవార్డు వస్తుందనుకున్నానని, తర్వాత బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఇక పురస్కారం (Padma Awards) రాదని భావించానని చెప్పుకొచ్చారు. అయితే తన సేవలను మోదీ సర్కారు గుర్తించడం సంతోషంగా ఉందని ఆయన చెప్పారు. ఈ పురస్కారంతో బీజేపీ, మోదీపై తనకు ఉన్న అభిప్రాయం తప్పని తెలుసుకున్నానంటూ ఖాద్రి చెప్పారు. తనకు అవార్డు ఇచ్చి గౌరవించిన మోదీ ప్రభుత్వానికి మరోసారి కృతజ్ఞతలు తెలిపారు. ఖాద్రి పలు జాతీయ, రాష్ట్ర పురస్కారాలు కూడా అందుకున్నాకు.