Modi: కర్ణాటకలో మోడీ పర్యటన… ఎన్నికల వేళ కాంగ్రెస్‌పై సెటైర్లు!

కర్ణాటకలో ఎన్నికల వేళ బీజేపీ వ్యూహాలకు పదును పెట్టింది. ఈ క్రమంలోనే భారీ మీటింగ్‌ పెట్టింది. వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. 450 కోట్లతో కట్టిన ఎయిర్ పోర్టును ప్రధాని మోడీ ప్రారభించారు.

  • Written By:
  • Publish Date - February 27, 2023 / 09:48 PM IST

Modi: కర్ణాటకలో ఎన్నికల వేళ బీజేపీ వ్యూహాలకు పదును పెట్టింది. ఈ క్రమంలోనే భారీ మీటింగ్‌ పెట్టింది. వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. 450 కోట్లతో కట్టిన ఎయిర్ పోర్టును ప్రధాని మోడీ ప్రారభించారు. ఇది కమళం ఆకారంలో ఉంటుంది. అంతే కాకుండా కాంగ్రెస్‌పై విమర్శలు గుప్పించారు.

కర్ణాటకలో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనుండడంతో ఆ రాష్ట్రంపై కేంద్రం ఫుల్‌గా ఫోకస్‌ పెంచింది. ప్రాజెక్టులే ఎజెండాగా ప్రజల దృష్టిని ఆకర్షించేందుకు ప్రధాని మోదీ ప్రణాళికలు రచిస్తున్నారు. ఈ ఏడాది కర్ణాటకలో ఇప్పటికే నాలుగు సార్లు పర్యటించగా.. ఇవాళే ఐదోసారి కన్నడనాట కలియతిరిగారు. శివమొగ్గలో అత్యాధునిక వసతులతో నిర్మించిన విమానాశ్రయాన్ని మోదీ ప్రారంభించారు. 450 కోట్లతో కట్టిన ఈ ఎయిర్ పోర్టును ఆకాశం నుంచి చూస్తే కమలం ఆకారంలో కనిపిస్తుంది. ఈ విమానాశ్రయం కార్యకలాపాలు పర్యాటకం, ఐటీ పరిశ్రమ స్థాపన లాంటి వివిధ రంగాల్లో ఈ ప్రాంత అభివృద్ధికి తోడ్పడతాయి.

హవాయ్ చెప్పులు ధరించిన వారు హవాయి జహాజ్ ప్రయాణించాలని భారత విమానయాన మార్కెట్ శరవేగంగా వృద్ధి చెందుతోందన్నారు మోదీ. శివమొగ్గ విమానాశ్రయాన్ని ప్రారంభించిన తర్వాత ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. రానున్న రోజుల్లో భారత్‌కు వేలాది విమానాలు అవసరమవుతాయని మేడిన్ ఇండియా ప్యాసింజర్ విమానాలు రావడడానికి రోజులు ఎంతో దూరంలో లేవన్నారు. శివమొగ్గ జిల్లాకు చెందిన కర్ణాటక బీజేపీ నేత, నాలుగుసార్లు సీఎం అయిన బీఎస్ యడ్యూరప్ప 80వ జన్మదినం సందర్భంగా ఈ విమానాశ్రయ ప్రారంభోత్సవం జరిగింది.

కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండడంతో మోదీ బెళగావిలో భారీ రోడ్ షో నిర్వహించారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు మోదీ. 16,800 కోట్లకుపైగా విలువైన పీఎం కిసాన్‌ 13వ విడతను విడుదల చేశారు. ఇంటింటికీ నల్లా కనెక్షన్‌ ఇచ్చే పథకానికి శ్రీకారం చుట్టారు. ఈ పథకం ద్వారా 4.4 లక్షల మందికి లబ్ధి జరగనుంది. మల్టీ విలేజ్ స్కీమ్‌లను ప్రారంభించిన మోదీ 950 కోట్ల విలువైన జల్‌ జీవన్ మిషన్‌ను మొదలు పెట్టారు. శివమొగ్గలోనే 895 కోట్ల విలువైన 44 స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్‌లను ప్రారంభించారు.