Site icon HashtagU Telugu

Manish Sisodia Arrested: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మనీష్ సిసోడియో అరెస్ట్!

Manish

Manish

దేశవ్యాప్తంగా ఢిల్లీ (Delhi) లిక్కర్ కేసు (Case) చర్చనీయాంశమవుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఢిల్లీలో మద్యం పాలసీలో అవినీతికి పాల్పడ్డారనే ఆరోపణలపై ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా (Manish Sisodia)ను సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) అరెస్టు చేసింది. ఉదయం నుంచి కేంద్ర ఏజెన్సీ ఆయన్ను విచారిస్తోంది.

తొమ్మిది గంటలకు పైగా విచారణ అనంతరం అరెస్టు చేశారు. తాను ఏడెనిమిది నెలలు జైలులో ఉండేందుకు సిద్ధమని సిసోడియా (Manish Sisodia) గతంలోనే చెప్పారు. ఆయన కుటుంబాన్ని ఆదుకుంటామని ఆయన పార్టీ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ హామీ ఇచ్చారు. (Manish Sisodia) అరెస్ట్ నేపథ్యంలో మరోసారి ఢిల్లీ లిక్కర్ కేసు హాట్ టాపిక్ గా మారింది. మనీష్ సిసోడియా అరెస్ట్ తో రాజకీయాల్లో కలకలం రేపుతుంది. ఈ క్రమంలో తెలుగు రాష్ట్రాలపై కూడా ఈడీ దాడులు చేస్తుండటం,  కొంతమంది ప్రముఖులకు ఉచ్చు బిగుస్తుండటం పలు రాజకీయ పార్టీల్లో అలజడి నెలకొంది.

Also Read: Chandrababu Naidu: తెలంగాణ ప్రజల గుండెల్లో టీడీపీ ఎప్పటికీ ఉంటుంది: చంద్రబాబు