Cbi Vs Mamata : మమతా బెనర్జీ మేనల్లుడిని ప్రశ్నించిన సీబీఐ

స్కూల్ జాబ్స్ కుంభకోణం కేసులో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీని సీబీఐ (Cbi Vs Mamata) ప్రశ్నించింది.

  • Written By:
  • Publish Date - May 20, 2023 / 02:44 PM IST

స్కూల్ జాబ్స్ కుంభకోణం కేసులో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీని సీబీఐ (Cbi Vs Mamata) ప్రశ్నించింది. శుక్రవారం రోజు సీబీఐ నుంచి వచ్చిన పిలుపునకు ప్రతిస్పందనగా .. అభిషేక్ బెనర్జీ శనివారం ఉదయం 10:58 గంటల ప్రాంతంలో కోల్‌కతాలోని సీబీఐ (Cbi Vs Mamata) కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు. పాఠశాల ఉద్యోగాల కుంభకోణానికి సంబంధించి అభిషేక్ బెనర్జీని ప్రశ్నలు అడిగింది. మమతా బెనర్జీకి సన్నిహితుడిగా పేరొందిన సుజయ్ కృష్ణ భద్ర నివాసంపైనా ఇవాళ తెల్లవారుజామునే ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) రైడ్స్ చేసింది.
స్కూల్ జాబ్స్ ను అమ్ముకునేందుకు డబ్బులు ఎలా చేతులు మారాయి ? అనే అంశంపై  ప్రధాన ఫోకస్ తో సుజయ్ కృష్ణ భద్రను ఈడీ ఇంటరాగేట్ చేసింది. టీచర్ల అక్రమ నియామకాలకు సంబంధించిన ఈ కేసులో సీబీఐ కూడా సుజయ్ కృష్ణ భద్ర ను మార్చి 15న ప్రశ్నించింది. ఇవాళ తెల్లవారుజామున, మార్చి 15న జరిపిన విచారణలలో సుజయ్ కృష్ణ భద్ర ఇచ్చిన సమాచారం ఆధారంగా.. మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీకి సీబీఐ ప్రశ్నలు సంధించింది. తృణమూల్ కాంగ్రెస్ నేత కుంతల్ ఘోష్ ఈ కేసులో కీలక నిందితుడిగా ఉన్నాడు. అతడు ఒక్కో టీచర్ జాబ్ ను అమ్మేందుకు రూ.20 లక్షలకు అమ్ముకున్నాడనే అభియోగాలు ఉన్నాయి. ” పాఠశాల కుంభకోణం కేసులో అభిషేక్ బెనర్జీ పేరును చెప్పాలని నాపై కేంద్ర దర్యాప్తు సంస్థలు ఒత్తిడి తెస్తున్నాయి” అని కుంతల్ ఘోష్ ఆరోపిస్తున్నారు.