తమిళనాడులోని కోయంబత్తూర్లో ఉన్న ఈశా ఫౌండేషన్లో మహాశివరాత్రి వేడుకలు అట్టహాసంగా జరిగాయి. దేశ నలుమూలల నుంచే కాకుండా.. విదేశాల పౌరులు సైతం వచ్చి ఈ వేడుకల్లో పాల్గొన్నారు. సద్గురు జగ్గి వాసుదేవ్ పాల్గొని భక్తులను ఉత్సాహపరిచారు. మహాశివుడి గొప్పతనాన్ని ఆయన వివరించారు. శుక్రవారం ఈశా యోగా కేంద్రంలో జరిగిన మహాశివరాత్రి వేడుకల్లో భారత ఉపాధ్యక్షుడు జగదీప్ ధంకర్ మాట్లాడుతూ మహాశివరాత్రి వేడుకలకు యువత ఆకర్షితులవుతున్నారన్నారు. “ఇక్కడ మహాశివరాత్రి వేడుకలు భాష, జాతీయత, మతం మరియు సంస్కృతికి అతీతంగా ఉంటాయి, అరుదైన ఏకీకరణ దృశ్యం మరియు ప్రస్తుత ప్రపంచానికి గొప్ప అవసరం. భక్తి, క్రియ, కర్మ మరియు జ్ఞాన అనే నాలుగు మార్గాలతో ఇక్కడ అందించబడిన పద్ధతులు ప్రత్యేకమైనవి, ”అని శ్రీ ధంఖర్ చెప్పారు. ఉపరాష్ట్రపతి వెంట ఆయన సతీమణి సుధేష్ ధన్కర్ ఉన్నారు. ఈ కార్యక్రమంలో తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి, త్రిపుర గవర్నర్ ఇంద్రసేనారెడ్డి, పంజాబ్ గవర్నర్ బన్వరీలాల్ పురోహిత్, కేంద్ర సమాచార, ప్రసార, మత్స్య, పశుసంవర్థక శాఖ సహాయ మంత్రి ఎల్ మురుగన్ పాల్గొన్నారు.
We’re now on WhatsApp. Click to Join.
సద్గురు యొక్క ఈశా యోగాలో పలువురు ప్రముఖులు కనిపించారు. సింగర్ మంగ్లీ, పూజా హెగ్డే , తమన్నా, రకుల్ ప్రీత్ మరియు శంకర్ మహదేవన్ ప్రముఖ వ్యక్తులు . ఈ వీడియోలు సోషల్ మీడియాలోకి రావడంతో వైరల్ అయ్యాయి. గ్రామీ అవార్డు గెలుచుకున్న గాయకుడు శంకర్ మహదేవన్ శుక్రవారం రాత్రి ఇషా ఫౌండేషన్లో జరిగిన అద్భుతమైన మహాశివరాత్రి ఉత్సవంలో తన బాలీవుడ్-ప్రేరేపిత ప్రదర్శననిచ్చారు. సంగీతకారుడి ఆకర్షణీయమైన ప్రదర్శనకు సంబంధించిన వీడియోలో నెట్టింట వైరల్గా మారాయి. ఇదిలా ఉంటే.. మహా శివరాత్రిని పురస్కరించుకొని దేశంలో శైవక్షేత్రాలు శివ నామస్మరణతో మార్మోగాయి. భోళా శంకరుడి దర్శనానికి భారీ సంఖ్యలో శైవ క్షేత్రాలకు భక్తులు తరలిరావడంతో అధికారులు ఏర్పాటు చేశారు.
Read Also : BRS: అప్పటి రోజులు మళ్లీ వచ్చాయి