India’s Biggest Pappu: ఇండియాస్ బిగ్గెస్ట్ పప్పు.. అమిత్ షాపై ‘టీఎంసీ’ ట్రోలింగ్!

కేంద్ర హోం మంత్రి అమిత్‌ షాను విమర్శిస్తూ తృణమూల్‌ కాంగ్రెస్‌ కొత్త ప్రచారానికి తెర తీసింది.

  • Written By:
  • Updated On - September 10, 2022 / 01:25 PM IST

కేంద్ర హోం మంత్రి అమిత్‌ షాను విమర్శిస్తూ తృణమూల్‌ కాంగ్రెస్‌ కొత్త ప్రచారానికి తెర తీసింది. టీషర్టులపై అమిత్‌ షా కార్టూన్‌ను ముద్రించి భారతదేశ అతి పెద్ద ‘పప్పు’ అనే క్యాప్షన్ ఇచ్చింది. వాటితో తృణమూల్‌ నాయకులు ర్యాలీలకు సిద్ధమవుతున్నారు. తృణమూల్ కాంగ్రెస్ తన ప్రత్యర్థి షాపై విరుచుకుపడటానికి వినూత్న ప్రచారానికి తెరలేపింది. మమతా బెనర్జీ నేతృత్వంలో అమిత్ షాపై కర్టూన్ దాడి చేసేందుకు సిద్ధమవుతున్నారు. రాహుల్ గాంధీపై బీజేపీ “పప్పు” అనే ముద్ర వేసింది. తాజాాగా మమతా బెనర్జీ కూడా అమిత్ షాపై అలాంటి ముద్ర వేసేందుకు స్కెచ్ వేసింది. రాబోయే దుర్గా పూజల సందర్భంగా పశ్చిమ బెంగాల్‌లోని అన్ని ప్రాంతాలలో పెద్ద సంఖ్యలో టీఎంసీ నాయకులు, కార్యకర్తలు ఈ ట్యాగ్ ను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు వ్యూహరచన చేస్తున్నారు.

TMC రాజ్యసభ నాయకుడు డెరెక్ ఓబ్రెయిన్ విలేకరులతో మాట్లాడుతూ.. ట్రోలింగ్ అత్యంత శక్తివంతమైన కమ్యూనికేషన్. ఇది మా జాతీయ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ చేసిన కామెంట్స్. ఇది సోషల్ మీడియాలో ట్రెండ్‌గా మారింది. బొగ్గు స్మగ్లింగ్ కేసుకు సంబంధించి ED చేత ఏడు గంటలకు పైగా విచారణ ఎదుర్కొన్న ఆయన అమిత్ షాను “భారతదేశం అతిపెద్ద పప్పు” అని అభివర్ణించారు.

మరుసటి రోజు, బెనర్జీ బంధువులు ఆకాష్ బెనర్జీ,  గేయెన్ షా కు సంబంధించిన టీ-షర్టులు ధరించి సోషల్ మీడియాలో ఫోటోలు పోస్ట్ చేశారు. 300 రూపాయల ‘నామమాత్రపు ధర’కు విక్రయించబడే టీషర్ట్స్ తో ప్రచారం చేస్తున్నారు. “మొదట్లో, టీ-షర్టులు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉండేవి. ఇప్పుడు వాటిని హోల్‌సేల్ మార్కెట్‌లలో పొందవచ్చు” అని టీఎంసీ నాయకులు ఛమత్కరిస్తున్నారు. “కాలేజీ విద్యార్థులు యువ పార్టీ నాయకులు ఈ రకం టీషర్టులను ధరించి అమిత్ షాను ట్రోలింగ్ చేసేందుకు రెడీ అవుతున్నారు. ప్రస్తుతం పశ్చిమ బెంగాల్ ఈ వ్యవహరం చర్చనీయాంశంగా మారింది.