India Team : మరో 24 గంటలు బార్బడోస్‌లోనే భారత జట్టు.!

టీ20 వరల్డ్ కప్ ఫైనల్ జరిగిన బార్బడోస్ను మరో 6 గంటల్లో బెరిల్ హరికేన్(తుఫాన్) తాకనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అక్కడ కర్ఫ్యూ తరహా వాతావరణం నెలకొందని జాతీయ మీడియా ప్రతినిధులు తెలిపారు.

  • Written By:
  • Publish Date - July 1, 2024 / 11:56 AM IST

టీ20 వరల్డ్ కప్ ఫైనల్ జరిగిన బార్బడోస్ను మరో 6 గంటల్లో బెరిల్ హరికేన్(తుఫాన్) తాకనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అక్కడ కర్ఫ్యూ తరహా వాతావరణం నెలకొందని జాతీయ మీడియా ప్రతినిధులు తెలిపారు. వర్షం మొదలైందని, ఎయిర్ పోర్టు మూసివేయడంతో భారత జట్టు ఆటగాళ్లు హోటల్స్కి పరిమితమయ్యారని పేర్కొన్నారు. దీంతో మరో 24 గంటల వరకు అక్కడే ఉంటారని తెలుస్తోంది..

We’re now on WhatsApp. Click to Join.

టీ20 వరల్డ్ కప్ను టీమ్ ఇండియా గెలుపొందడంపై విరాట్ కోహ్లి చేసిన ఇన్‌స్టా పోస్ట్ రికార్డు సృష్టించింది. కఠో, టీమ్ ఉన్న ఫొటోలతో ‘ఇంతకంటే మంచి రోజు వస్తుందని కలలో కూడా ఊహించలేదు’ అని పోస్ట్ చేశారు. ఈ పోస్టుకు ఇప్పటివరకు 18 మిలియన్ల లైట్స్తో పాటు 6.6 లక్షల కామెంట్స్ వచ్చాయి. గతంలో కియారా, సిద్ధార్థ్ పేరిట ఉన్న రికార్డును సైతం బ్రేక్ చేసింది.

టీ20 ప్రపంచ కప్ చరిత్రలోనే తొలిసారిగా ఈ సీజన్లోనే అత్యధికంగా 20 జట్లు పాల్గొన్నాయి. ఈ ప్రపంచకప్ అమెరికా, అఫ్గానిస్థాన్, దక్షిణాఫ్రికా వంటి జట్లకు మరుపురానిది. ఆతిథ్య హోదాలో తొలిసారి WC ఆడిన USA అద్భుత ఆటతో సూపర్-8కు చేరి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇక అఫ్గాన్ జట్టు న్యూజిలాండ్‌, ఆస్ట్రేలియాను చిత్తుచేసి తొలి సారి సెమీస్ చేరింది. మరోవైపు సఫారీలు మొదటి సారి వరల్డ్ కప్ ఫైనల్ చేరగా విజయానికి అడుగుదూరంలో తడబడ్డారు.

అయితే.. వరల్డ్ కప్ సాధించాలనే మిషన్ పూర్తయినట్లు బీసీసీఐ ట్వీట్ చేసింది. ‘కోట్ల మంది అభిమానుల భావోద్వేగాలు, చిరునవ్వులు, కలలతో కూడుకున్న T20 వరల్డ్ కప్ను కైవసం చేసుకున్నాం. ప్రపంచ విజేతలుగా నిలిచాం. కెప్టెన్.. మీరు సాధించారు’ అంటూ టీ20 WC ట్రోఫీతో రోహిత్ దిగిన ఫొటోలను పంచుకుంది.

Read Also : JP Nadda : మహిళలకు బెంగాల్ సురక్షితం కాదు