Site icon HashtagU Telugu

China Border-India Army : చైనా బార్డర్ లో ఇండియా ఆర్మీ యాక్టివ్.. ఎందుకంటే ?

China Border India Army

China Border India Army

China Border-India Army : చైనా బార్డర్ లో ఇండియా ఆర్మీ యాక్టివిటీని పెంచింది.

ధనుష్ హోవిట్జర్ ఆర్టిల్లరీ తుపాకులు.. టి-90, టి-72 యుద్ధ  ట్యాంకులు.. M4 క్విక్ రియాక్షన్ ఫోర్స్ వెహికల్స్ ను లడఖ్‌లో మోహరించింది.

లడఖ్‌లోని సింధు నది ఒడ్డున 14,500 అడుగుల ఎత్తున్న పర్వత శ్రేణులపై కొత్త ఆయుధాలు, వాహనాలను రంగంలోకి దింపింది. 

సింధు నది లడఖ్ సెక్టార్ మీదుగా చైనా సైన్యం నియంత్రణలో ఉన్న టిబెటన్ ప్రాంతంలోకి .. అక్కడి నుంచి పాకిస్తాన్‌లోకి ప్రవేశిస్తుంది.   

ఆర్మీ యాక్టివిటీకి సంబంధించిన వీడియో ఒకటి వెలుగులోకి రావడంతో .. దీనిపై డిస్కషన్ మొదలైంది.

 T-90, T-72 యుద్ధ  ట్యాంకులు, ఆల్ టెర్రైన్ వెహికల్స్ నదిని దాటుతున్న దృశ్యాలు ఆ వీడియోలో ఉన్నాయి. 

వీటిని లడఖ్‌లోని న్యోమా మిలిటరీ స్టేషన్‌లో మోహరించినట్లు తెలిసింది. 

ధనుష్ హోవిట్జర్ 

ధనుష్ హోవిట్జర్‌ను మన దేశంలోనే తయారు చేశారు. ఇది బోఫోర్స్ ఫిరంగి యొక్క అధునాతన వెర్షన్. ఇది 48 కిలోమీటర్ల వరకు లక్ష్యాలపై దాడి చేయగలదు.

M4 క్విక్ రియాక్షన్ ఫోర్స్ వెహికల్

M4 క్విక్ రియాక్షన్ ఫోర్స్ వెహికల్స్ ఎంతో స్ట్రాంగ్. ల్యాండ్ మైన్ పేలినా ఇవి చెక్కుచెదరవు. 50 కిలోల IED బ్లాస్ట్‌ను కూడా M4 క్విక్ రియాక్షన్ ఫోర్స్ వెహికల్స్ తట్టుకోగలవు. లడఖ్ సెక్టార్‌లోని కష్టతరమైన, కొండలు గుట్టల భూభాగంలో కూడా ఈ వాహనం గంటకు 60-80 కిలోమీటర్ల వేగంతో నడవగలదు.

ఆల్ టెర్రైన్ వెహికల్స్ 

ఆల్ టెర్రైన్ వాహనాల విషయానికి వస్తే .. వీటిలో ఒకేసారి నలుగురు నుంచి ఆరుగురు సైనికులు వెళ్లే సౌలభ్యం ఉంటుంది. సైనికుల సామాను, సామగ్రిని తీసుకెళ్లడానికి ఈ వాహనాలను ఉపయోగిస్తారు. ఈ వాహనం ఎత్తైన ప్రాంతాలలో కూడా జర్నీ చేయగలదు.

Also read : Threads: దూసుకుపోతున్న థ్రెడ్‌.. 24 గంటల్లోనే అత్యధిక డౌన్ లోడ్ లు..!

రాజక్ నిఘా వ్యవస్థ

సైన్యం నిఘాను బలోపేతం చేయడానికి కొత్త రాజక్ వ్యవస్థను ప్రవేశపెట్టారు. దీని ద్వారా 15 కి.మీ కంటే ఎక్కువ దూరంలో ఉన్న సైనికులను గుర్తించవచ్చు. 25 కి.మీ కంటే ఎక్కువ దూరంలోని వాహనాలను కూడా ఐడెంటిఫై చేయొచ్చు. LAC అంతటా చైనా కార్యకలాపాలపై నిఘా ఉంచేందుకు వీటిని వాడుతున్నారు.

ఎందుకీ ప్రిపరేషన్ ? 

ఆకస్మిక పరిస్థితులకు సన్నద్ధం కావడానికి ఇటువంటి కసరత్తులు నిర్వహిస్తున్నట్లు భారత  ఆర్మీ అధికారులు(China Border-India Army) తెలిపారు. లోయల మార్గాల ద్వారా భారత భూభాగాలను ఆక్రమించుకోవాలనే చైనా ప్రయత్నాన్ని అడ్డుకునేందుకే సైన్యం ఈవిధంగా రెడీ అవుతోందని పరిశీలకులు అంటున్నారు. లడఖ్  భూభాగంలో ట్యాంకులతో యుద్ధ  పోరాటానికి అనుకూలంగా ఉండే చాలా ఓపెన్ లోయలు ఉన్నాయి.