Site icon HashtagU Telugu

RBI Monetary Policy April 2023: సామాన్య ప్రజలకు శుభవార్త. రెపోరేటులో ఎలాంటి మార్పు లేదన్న ఆర్బీఐ.

RBI Penalty

All Banks Open Till March 31.. Rbi Orders.. April 1, 2 Banks Close

సామాన్య ప్రజలకు శుభవార్త చెప్పింది రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI Monetary Policy April 2023). మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) తొలి సమావేశంలో రెపో రేటులో ఎలాంటి మార్పు చేయకూడదని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) నిర్ణయించింది. మూడు రోజుల ఎంపీసీ సమావేశ ఫలితాలను ప్రకటిస్తూనే గవర్నర్ శక్తికాంత దాస్ రెపోరేటును స్థిరంగా ఉంచుతున్నట్లు ప్రకటించారు. రెపో రేటు 6.50శాతం వద్ద యథాతథంగా ఉంటుందని చెప్పారు. సమావేశానికి ముందు, RBI రెపో రేటును 0.25% పెంచే అవకాశం ఉందని ఊహాగానాలు వచ్చాయి. ఆర్‌బీఐ ఈ ప్రకటనతో మార్కెట్‌లో కుదేలైంది. ఉదయం మార్కెట్ ప్రారంభమయ్యే సరికి నష్టాల్లో ఉంది.

బ్యాంకులకు తక్కువ వడ్డీ రేట్లకు రుణాలు అందుబాటులో ఉన్నప్పుడు అంటే రెపో రేటు తక్కువగా ఉన్నప్పుడు, వారు తమ కస్టమర్లకు చౌకగా రుణాలు కూడా ఇవ్వవచ్చు. రిజర్వ్ బ్యాంక్ రెపో రేటును పెంచినట్లయితే, బ్యాంకులు రుణాలు తీసుకోవడానికి ఖర్చుతో కూడుకున్నవిగా మారతాయి. వారు తమ ఖాతాదారులకు రుణాలను మరింత ఖరీదైనవిగా మారుతాయి. రెపో రేటులో మార్పు సామాన్య ప్రజలను ఎలా ప్రభావితం చేస్తుందో, దీన్ని సరళమైన భాషలో అర్థం చేసుకోవచ్చు. బ్యాంకులు మనకు రుణాలు ఇస్తాయి. ఆ రుణానికి మనం వడ్డీ చెల్లించాలి. అదేవిధంగా, బ్యాంకులు కూడా వారి రోజువారీ కార్యకలాపాలకు భారీ మొత్తంలో డబ్బు అవసరం. బ్యాంకులు భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) నుండి రుణం తీసుకుంటాయి. ఈ రుణంపై రిజర్వ్ బ్యాంక్ వడ్డీని వసూలు చేసే రేటును రెపో రేటు అంటారు.

గతేడాది వడ్డీ రేటు ఎన్ని రెట్లు పెరిగింది

-మే – 0.4 %
-జూన్ 8 -0.5 %
-ఆగస్టు 5 – 0.5%
-సెప్టెంబర్ 30 – 0.5 %
-డిసెంబర్ 7 – 0.35 %
-ఫిబ్రవరి 8 – 0.25%