Gurpatwant Singh Pannun: ఖలిస్థాన్ అనుకూల వ్యక్తుల మరణాలు ఒకదాని తర్వాత ఒకటిగా జరుగుతున్న నేపథ్యంలో అమెరికా నుంచి ఓ పెద్ద వార్త తెరపైకి వచ్చింది. అమెరికాలో భారత మోస్ట్ వాంటెడ్ ఖలిస్తానీ ఉగ్రవాది, సిక్కు ఫర్ జస్టిస్ వ్యవస్థాపకుడు గురుపత్వంత్ సింగ్ పన్ను (Gurpatwant Singh Pannun) రోడ్డు ప్రమాదంలో మరణించినట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. గురుపత్వంత్ సింగ్ పన్నూ మరణం ఖలిస్తాన్ ఉద్యమానికి నిజంగా పెద్ద దెబ్బే. సోషల్ మీడియా నివేదికల ప్రకారం.. US హైవే 101లో పన్ను ప్రమాదం జరిగింది. అయితే ఖలిస్తానీలు కానీ, అమెరికా ప్రభుత్వం కానీ ఈ విషయంలో ఎలాంటి ధృవీకరణ ఇవ్వలేదు.
60 రోజుల్లోనే ముగ్గురు ఖలిస్తానీలు హతమయ్యారు
60 రోజుల్లో హర్దీప్ సింగ్ నిజ్జర్, అవతార్ సింగ్ ఖాండా, పరమజిత్ సింగ్ పంజ్వార్‌లతో సహా ఖలిస్థాన్ అనుకూల ఉగ్రవాదులు మరణించారు. వారి మరణం తరువాత గురుపత్వంత్ సింగ్ పన్ను 3 వారాల పాటు దాక్కున్నాడు. ఇటీవల, ఖలిస్తాన్ మద్దతుదారుల మరణ వార్త తర్వాత అతను ఒక వీడియోను కూడా విడుదల చేశాడు. కెనడా, అమెరికాలోని భారత రాయబార కార్యాలయ అధికారులను దీనికి బాధ్యులను చేశాడు. ఇదే అతడి చివరి బెదిరింపు వీడియో. గురుపత్వంత్ పన్ను పంజాబ్ రెఫరెండం 2020 పేరుతో అమెరికాలో చాలా కాలంగా ఖలిస్తానీ ఉద్యమాన్ని నడుపుతున్నాడు. ఇక్కడ సిక్కులను రెచ్చగొట్టే ప్రయత్నం చేశాడు.
Also Read: Gas Leak: దక్షిణాఫ్రికాలో 16 మంది మృతి.. గ్యాస్ లీక్ కారణమా..?
సోషల్ మీడియాను ఉపయోగించారు
ఖలిస్తాన్ ప్రచారంతో సిక్కులను కనెక్ట్ చేయడానికి పన్ను సోషల్ మీడియాను ఉపయోగించాడు. పంజాబ్‌లో ఇలాంటి వ్యక్తులు చాలా మంది పట్టుబడ్డారు. వారు పన్ను సూచన మేరకు ప్రభుత్వ, బహిరంగ ప్రదేశాలలో ఖలిస్తానీ నినాదాలు వ్రాసి వాతావరణాన్ని రెచ్చగొట్టే పనిచేశారు. ఇటీవలి నివేదికల ప్రకారం.. ప్రముఖ ఖలిస్తానీ నాయకుల ఆకస్మిక మరణాలు, తొలగింపు ఫలితంగా యునైటెడ్ కింగ్‌డమ్, కెనడాలో పనిచేస్తున్న ఖలిస్తానీ ఉగ్రవాద సంస్థల పరిమాణం, ప్రభావం క్షీణించింది.