Site icon HashtagU Telugu

Petrol Prices: వాహనదారులకు గుడ్‌ న్యూస్‌… తగ్గనున్న పెట్రోల్‌, డీజిల్‌.. ఎప్పటి నుంచంటే!

Petrolprice 1

Petrolprice 1

Petrol Prices: కరోనా అనంతరం అన్నీ ధరలు ఆకాశానంటాయి. సామాన్యుడు ఏదీ కొనలేని స్థితికి వచ్చేసింది. పెట్రోల్‌, డీజిల్‌ ధరలు అయితే సెంచరీ కొట్టి పరుగులు పెడుతున్నాయి. అయితే వాహనదారులకు త్వరలో కేంద్రం ఊరటనిచ్చే శుభవార్త చెప్పే సూచనలు కనిపిస్తున్నాయి. వచ్చే ఏడాది పెద్ద రాష్ట్రాల్లో ఎన్నికలు ఉండటం,రష్యా నుంచి తక్కువ ధరకు క్రూడాయిల్‌ దొరుకుతున్న తరుణంలో తగ్గించే సంకేతాలు ఉన్నాయి. ప్రముఖ
ప్రతిక ఓ కథానాన్ని ప్రచురించింది.

హిమాలయ అంచుల్ని తాకిన పెట్రోల్, డీజిల్‌ ధరలతోపాటు కొన్నింటిపై ట్యాక్స్‌ తగ్గించే అవకాశం ఉందని రాయిటర్స్‌ తన కథనంలో
తెలిపింది. కొంత కాలంగా దేశంలో పెరిగిపోతున్న ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేసేందుకు కేంద్రం, ఆర్‌బీఐ కృషి చేస్తున్నాయి. ఇందులో భాగంగా గతేడాది మే నెలలో పెట్రోల్‌పై 8 రూపాయలు, డీజిల్‌పై 6 రూపాయలు చొప్పున ఎక్సైజ్‌ సుంకాన్ని కేంద్ర సర్కారు తగ్గించింది. కొన్ని రాష్ట్రాలు కూడా ఇదే పద్ధతిలో తగ్గించాయి.

అయితే జనవరి నెల నుంచి వినియోగ ధరల సూచీ ఆధారిత రిటైల్‌ ద్రవ్యోల్బణం మళ్లీ పంజా విసరడంతో కేంద్రం, ఆర్‌బీఐ లెక్క లు తారుమారయ్యా యి. డిసెంబర్‌ నెలలో 5.72 శాతంగా ఉన్న రిటైల్‌ ద్రవ్యోల్బ ణం 6.52 శాతానికి చేరిపోయింది. జనవవరిలో మూడు నెలల గరిష్ట స్థాయి 6.52 శాతంగా నమోదయ్యింది. రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాకి కేంద్రం నిర్దేశిస్తున్న దాని ప్రకారం, రిటైల్‌ ద్రవ్యోల్బణం 6 శాతం దిగువన ఉండాలి. అయితే 10 నెలలు ఆపైన కొనసాగిన రిటైల్‌ ద్రవ్యోల్బణం నవంబర్, డిసెంబర్‌ నెలల్లో కట్టడిలోకి వచ్చింది.

ఆర్‌బీఐ సూచన మేరకు కేంద్రం మొక్క జొన్నపై విధిస్తున్న దిగుమతి సుంకాన్ని తగ్గించాలని చూస్తోంది. దీనిపై ప్రస్తుతం 60 శాతం బేసిక్‌ డ్యూటీ వర్తిస్తోంది. అలాగే పెట్రో ధరలపై మరోసారి ఊరట ఇచ్చే అంశాన్ని కేంద్రం పరిశీలిస్తోందని పేర్కొ న్నా యి.