Site icon HashtagU Telugu

Congress-Brs Vs Modi : మోడీ ప్రభుత్వంపై బీఆర్ఎస్, కాంగ్రెస్ అవిశ్వాస తీర్మానం

Congress Brs Vs Modi

Congress Brs Vs Modi

Congress-Brs Vs Modi :   మణిపూర్ హింసపై పార్లమెంటులో ప్రకటన చేయడానికి  ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నిరాకరించిన నేపథ్యంలో  “ఇండియా” కూటమి , బీఆర్‌ఎస్ పార్టీలు  కీలక నిర్ణయం తీసుకున్నాయి.  కాంగ్రెస్‌ నేతృత్వంలోని “ఇండియా” కూటమి , బీఆర్‌ఎస్ పార్టీలు ఈరోజు లోక్‌సభలో ప్రధాని మోడీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి  ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టాయి.

“మా పార్టీ తరపున ఈరోజు  అవిశ్వాస తీర్మానం పెట్టాం. సభ ప్రారంభమైనప్పటి నుంచి ప్రతిపక్ష నేతలంతా మణిపూర్‌ అంశంపై చర్చించాలని డిమాండ్‌ చేస్తున్నారు. దీనిపై ప్రధాని మాట్లాడితే దేశ ప్రజలు శాంతిస్తారు. అందుకే మేం ఈరోజు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాం” అని బీఆర్‌ఎస్ ఎంపీ నామా నాగేశ్వరరావు అన్నారు.

ఇక మోడీ ప్రభుత్వంపై కాంగ్రెస్ కూడా అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టింది. అవిశ్వాస తీర్మానంపై లోక్‌సభలో కాంగ్రెస్ విప్ మాణిక్కం ఠాగూర్ ఇలా అన్నారు.. “ఇండియా కూటమి ఈరోజు అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టింది. ప్రధాని మోడీ  అహంకారాన్ని విచ్ఛిన్నం చేయడానికే ఈ ప్రయత్నం చేశాం. పార్లమెంటుకు వచ్చి మణిపూర్‌పై ప్రకటన చేయకుండా మోడీ అహంకారంతో ప్రవర్తిస్తున్నారు. అందుకే  చివరి ఆయుధంగా  అవిశ్వాస తీర్మానాన్ని ప్రయోగించాం” అని మాణిక్కం ఠాగూర్ తెలిపారు.  కాగా, సంఖ్యాబలం తమ వైపు ఉన్నందున అవిశ్వాస తీర్మానం తమపై ప్రభావం చూపదని బీజేపీ పేర్కొంది.